ఉదయ్ కిరణ్‌ మరణంపై అనుమానం.. చిరంజీవి వద్దకు వెళ్లి ఏడ్చేవాడు.. సోదరి శ్రీదేవి సంచలనం

వరుస విజయాలతో దూసుకెళ్లిన ఉదయ్ కిరణ్‌కు ఒక్కసారిగా ఫ్లాప్‌లు ఎదురయ్యాయి. దాంతో కెరీర్ అంధకారంగా మారింది. చాలా సినిమాలు చేసినప్పటికీ కెరీర్ పరంగా నిలదొక్కుకోలేకోపోయాడు. ఓ ప్రేమ, మరో నిశ్చితార్థం బ్రేకప్ కావడంతో పరిస్థితి మరింత చేజారింది. నిరంతరం సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకొనేందుకు ప్రయత్నించాడు. కానీ పరిస్థితులు చేజారడంతో ఆత్మహత్యకు చేసుకోవడం జరిగింది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య, అతని సమస్యలపై తన సోదరి శ్రీదేవి ఇటీవల య్యూట్యూబ్ ఇంటర్యూలో వెల్లడించారు. ఆమె ఏం చెప్పారంటే..

ఉదయ్ కిరణ్‌కు సమస్యల్లేవు

ఉదయ్ కిరణ్‌కు సమస్యల్లేవు

ఉదయ్ కిరణ్‌కు ఆర్థిక సమస్యలు లేవు. ప్రతీ పైసా తన వద్దే ఉంచుకొన్నాడు. నాన్న, నా వద్ద లేనే లేవు. సినిమా అవకాశాలు లేకపోయినా ఉదయ్‌కి ప్రాబ్లం కాదు. కానీ ఏ కారణంగా ఆత్మహత్య చేసుకొన్నాడో నాకు తెలియదు. నా తమ్ముడి మరణం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయి.

చాలా సరదాగా మాట్లాడేవాడు

చాలా సరదాగా మాట్లాడేవాడు

నాతో ఎప్పుడు మాట్లాడినగానీ సరదాగా మాట్లాడేవాడు. ఏ కష్టముందని కూడా చెప్పలేదు. ఉదయ్ తన మరణానికి ముందు జనవరి 1వ తేదీన నాతో మాట్లాడాడు. మళ్లీ సినిమాలో కమ్‌బ్యాక్ అవుతానని విశ్వాసంగా చెప్పేవాడు. పలుమార్లు మళ్లీ హీరోగా నిలదొక్కుకుంటానని చెప్పాడు. అంతలోనే జనవరి 4వ తేదీన ఆత్మహత్య చేసుకోవడం ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం.

చిరంజీవి వద్ద ఏడ్చి..

చిరంజీవి వద్ద ఏడ్చి..

ఉదయ్ కిరణ్ తొలి ప్రేమ భారీగా దెబ్బ తీసింది. మనసంతా నువ్వే సినిమా తర్వాత ఉదయ్‌ కిరణ్‌ను ఓ జర్నలిస్టు ఇంటర్వ్యూ చేసింది. ఆ తర్వాత వారిద్దరూ దగ్గరయ్యారు. ప్రేమించుకొన్నారు. ఆ అమ్మాయిని గాఢంగా ప్రేమించారు. కొన్ని అభిప్రాయ బేధాలు తలెత్తడంతో విడిపోయాడు. తన తొలి బ్రేకప్ తర్వాత కోలుకోవడానికి చాలా కష్టపడ్డాడు. ఆ సమయంలో చిరంజీవి ఆదరించారు. తన బాధను చెప్పుకొని చిరంజీవి వద్ద ఏడ్చాడు.

తొలి బ్రేకప్ దారుణం

తొలి బ్రేకప్ దారుణం

ఉదయ్ కిరణ్ తొలి బ్రేకప్ తర్వాత చిరంజీవి బాగా హెల్ప్ చేశాడు. గాడ్ ఫాదర్‌గా చిరంజీవి వ్యవహరించారు. కెరీర్‌పై దృష్టిపెట్టమని ప్రోత్సాహించాడు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ గురించి తెలుసుకొన్నాక చిరంజీవి తన కూతురును ఇవ్వడానికి ప్రతిపాదన తెచ్చారు. నేను, ఉదయ్ కిరణ్ వెళ్లి మాట్లాడిన తర్వాత పెళ్లికి ఒప్పుకోవడం జరిగింది. చిరంజీవి మంచి వ్యక్తి. చాలా సార్లు మనసు విప్పి మాట్లాడారు అని ఉదయ్ కిరణ్ సోదరి కన్నీళ్ల పర్యంతమైంది.

చిరంజీవి కూతురుతో ఎంగేజ్‌మెంట్

చిరంజీవి కూతురుతో ఎంగేజ్‌మెంట్

చిరంజీవి కూతురుతో ఎంగేజ్‌మెంట్ తర్వాత వారిద్దరూ చాలా బాగా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో అంతరాల్లో భారీ గ్యాప్ కనిపించింది. చిరంజీవి కూతురు సంపన్నురాలు. ఉదయ్ కిరణ్ చాలా సింపుల్. చిన్న కుటుంబం నుంచి రావడంతో వారి మధ్య విభేదాలు బాగా పెరిగిపోయాయి.

ఇద్దరి అంగీకారంతోనే ఎంగేజ్‌మెంట్

ఇద్దరి అంగీకారంతోనే ఎంగేజ్‌మెంట్

చిరంజీవి వద్దకు వెళ్లి తమ మధ్య అభిప్రాయ బేధాలు చాలా ఉన్నాయి. జీవితంలో ముందుకు కొనసాగడం కష్టమని ఉదయ్ కిరణ్ చెప్పడంతో చిరంజీవి బాగా ఆలోచించారు. ఆ తర్వాత పెళ్లి ఎంగేజ్‌మెంట్‌ను ఇద్దరి అంగీకారంతో చిరంజీవి క్యాన్సిల్ చేయడం జరిగింది. అలా రెండోసారి ఉదయ్ కిరణ్ జీవితంలో భారీ దెబ్బ తగిలింది అని ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X