twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇష్టమైన కంచిపట్టు చీరతోనే.. శ్రీదేవి చివరి ప్రయాణం.. గుండె కోత పెట్టి..కన్నీటితో

    By Rajababu
    |

    Recommended Video

    Sridevi Mortal being taken for Cremation, Watch Video

    వేలాది మంది తోడు రాగా శ్రీదేవి అంతిమయాత్ర కొనసాగుతున్నది. ముంబై వీధుల్లో అశ్రునయనాలతో ప్రజలు శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె అంతిమయాత్ర వెంట అభిమానులు వాహనాలపై కాన్వాయ్‌గా బయలుదేరారు. శ్రీదేవి ఫోటోలను చేతులో పెట్టుకొని ఆమె వెంట నడిచారు. శ్రీదేవి అంతిమయాత్రకు సంబంధించిన మరిన్నీ విషయాలు మీకోసం..

    అందానికి నిలువెత్తు రూపం

    అందానికి నిలువెత్తు రూపం

    అందానికి నిలువెత్తు రూపం శ్రీదేవి. అందానికి అర్థం వెతుక్కొవాలంటే శ్రీదేవిని చూస్తే చాలు. అలాంటి శ్రీదేవి ఐదు దశాబ్ధాలకుపైగా సినీ జీవితంతో దేశ ప్రజలు, సినీ అభిమానుల హృదయంలో గూడుకొట్టుకొన్నది. ఇక శ్రీదేవి లేరన్న విషయం గుర్తొచ్చిన ప్రతీసారి అభిమానులకు గుండె కోతను మిగిల్చింది.

    కంచిపట్టు చీరతోనే..

    కంచిపట్టు చీరతోనే..

    శ్రీదేవి చివరి ప్రయాణాన్ని తనకు ఇష్టమైన కంచిపట్టు చీరతోనే ముగించింది. ఊహ తెలిసినప్పటి నుంచి ముఖానికి మేకప్‌తోనే జీవించింది. అలాంటి మేకప్ చివరి అంకంలోనూ ఆమె వెంట వచ్చింది. అంతిమయాత్ర కోసం శ్రీదేవిని అందంగా ముస్తాబు చేశారు.

     ముఖంపై పెద్ద కుంకుమబొట్టు

    ముఖంపై పెద్ద కుంకుమబొట్టు

    ముఖంపై చక్కగా పెద్ద సైజు కుంకుమ బొట్టును పెట్టారు. పెదాలకు ఎర్రటి లిప్‌స్టిక్ పూశారు. మెడలో మహాలక్ష్మిలా బంగారు ఆభరణాన్ని ధరింపజేశారు. అలా తన అభిరుచులకు ఏమాత్రం తగ్గకుండా చివరి ప్రయాణాన్ని ముగించింది.

    జాతీయజెండాతో గౌరవ వందన

    జాతీయజెండాతో గౌరవ వందన

    దేశానికి అందించిన సేవలకు గుర్తుగా శ్రీదేవి పార్థీవ దేహంపై జాతీయ జెండాను కప్పి అధికారులు శ్రద్ధాంజలి ఘటించారు. ముంబై వీధుల్లో విషాదఛాయాలు నెలకొన్నాయి.

    English summary
    Sridevi's final journey has begun, with a decorated truck carrying the iconic actor's mortal remains to the Vile Parle's crematorium, where the final rites and cremation will take place.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X