పిక్చర్స్ : శ్రీదేవి గ్లామర్ కేక...
హైదరాబాద్ : ఐదు పదుల వయసుకు చేరువవుతున్నా వన్నెదగ్గని అందంతో వెలిగిపోతూ...'అతిలోక సుందరి' అనే పేరును సార్ధకం చేసుకుంటోంది హీరోయిన్ శ్రీదేవి. శుక్రవారం ఆమె ముంబైలో 'లైవ్ వెల్ డైట్' అనే పుస్తకం ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె రూపం అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది.
మంచి డైట్ తీసుకుంటే ఆరోగ్యంగా, ఆనందంగా జీవించ వచ్చు అనే అంశాలతో గోల్డ్ మెడలిస్ట్ మరియు వెల్‌నెస్ ప్రాక్టీషనర్ డాక్టర్ సరితా దేవరె, మాస్టర్ చెఫ్ సంజయ్ కపూర్ ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీదేవి చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారు.
ఇతర వివరాల్లోకి వెళితే...సినిమాలకు దూరమైన చాలా కాలం తర్వాత 'ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రం ద్వారా రీఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి, తనకు సూటయితే మరిన్ని సినిమాలు చేయడానికి సిద్ధమే అని వెల్లడించారు. కాగా....రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'బాహుబలి' చిత్రంలో శ్రీదేవి నటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం ఇంకా నిర్ణారణ కాలేదు.

లైవ్ వెల్ డైట్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన శ్రీదేవి

సంజయ్ కపూర్, సరితా దేవరెలతో కలిసి శ్రీదేవి

పుస్తకం ప్రాముఖ్యతను వివరిస్తున్న శ్రీదేవి

కార్యక్రమానికి హాజరైన ప్రముఖులతో కలిసి శ్రీదేవి

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న శ్రీదేవి

శ్రీదేవి ముగ్దమనోహర రూపం

శ్రీదేవి


Click it and Unblock the Notifications











