అతిలోక సుందరి శ్రీదేవి..అష్టకష్టాలు!
అతిలోక సుందరిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న తార శ్రీదేవి. ఆమె సినిమాలు మానేసి చాలా సంవత్సరాలే అయినా ఇప్పటికీ శ్రీదేవి అంటే పడి చచ్చేవాళ్లు చాలా మందే ఉన్నారు. అంతెందుకు శ్రీదేవి అభిమానుల్లో రామ్ గోపాల్ వర్మ లాంటి ప్రముఖ దర్శకులే ఉన్నారంటే ఆమె అందం, అభినయం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత హౌస్ వైఫ్ గా సెటిలైన శ్రీదేవి ఇంతకాలం తన ఇద్దరు కూతుర్ల బాగోగులు చూసుకుంటూ గడిపేసింది. అలా అని అందాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఇప్పటికీ సన్నటి తీగలా నవనవలాడుతోంది. ఇన్నాళ్లుకు అభిమానుల కోరిక మేరకు రీ ఎంట్ర ఇస్తోంది శ్రీదేవి. 'ఇంగ్లిష్ వింగ్లిష్" అనే హిందీ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. ఈ సినిమాలో లెజండరీ నటుడు అమితాబ్ తో జతకడుతోంది.
ఈ సినిమాలో మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ గా నటిస్తోన్న శ్రీదేవి...అమెరికాలో బట్లర్ ఇంగ్లిష్ (ఇంగ్లీష్ సరిగా మాట్లాడటం రాని) మాట్లాడే మహిళగా నటిస్తోంది. దీంతో అంతా ఆమె బాషను చూసి నవ్వుతుంటారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ఈ సినిమాలో అష్ట కష్టాలు పడుతుంట శ్రీదేవి. ఈ సినిమాకు గౌరీ షిండే దర్శకత్వం వహిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళంలో ఈ సినిమా ఒకేసారి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. తమ అభిమాన తార మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుండటంతో శ్రీదేవి సినిమా ఎప్పుడు విడుదలవుతుందా..అని ఆశగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.


Click it and Unblock the Notifications











