దర్శకుడు జెడి చక్రవర్తి మీద పోలీసు కేసు పెట్టడానికి ఒకనాటి అందాల నటి శ్రీదేవి సిద్ధమవుతోంది. వారిద్దరి మధ్య అంత వైరం ఎందుకంటారా? జెడి చక్రవర్తి రామ్ గోపాల్ వర్మ వద్ద "క్షణం క్షణం" సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అప్పుడు పెద్ద తారలా వెలుగొందుతున్న శ్రీదేవి అందులో హీరోయిన్. షూటింగ్ సమయంలో ఒకసారి శ్రీదేవి మిడ్డీలోనుంచి ఆమె అందాలను చూశానని జెడి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. దానితో శ్రీదేవి అగ్గి మీద గుగ్గిలమైంది. ఆమె భర్త బోనీ కపూర్ అయితే బీపీ పెరిగిపోయి జెడిపై ఎటువంటి చర్య తీసుకోవచ్చో చెప్పమని లాయర్ల చుట్టూ తిరుగుతున్నాడు. తన శిష్యుడు జెడిని కాపాడుకోడానికి రామ్ గోపాల్ వర్మ రాజీ చేస్తారేమో చూడాలి.