»   » శ్రీదేవి ఆస్తులు: వారంతా ముంచేయగా మిగిలినవి ఇవే, ఆ ఇద్దరికీ సమానంగా!

శ్రీదేవి ఆస్తులు: వారంతా ముంచేయగా మిగిలినవి ఇవే, ఆ ఇద్దరికీ సమానంగా!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Sridevi's Life Truths : బోనీ కపూర్‌ను ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని బాధపడిందట ?

  బోనీ కపూర్‌తో పెళ్లి జరిగే సమయానికి శ్రీదేవి వద్ద పెద్దగా ఆస్తులు ఏమీ లేవు. చిన్నతనం నుండి నటిస్తున్న శ్రీదేవి సినిమాల ద్వారా బాగానే సంపాదించినప్పటికీ బంధువులు, సోదరి మోసం చేయడం, తల్లి చేసిన కొన్ని తప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ వల్ల తను సంపాదించిన ఆస్తుల్లో చాలా వరకు ఆమె కోల్పోయారు.

  భారీగా సంపాదన, కానీ

  భారీగా సంపాదన, కానీ

  బాలనటిగా శ్రీదేవి తన నట జీవితం మొదలు పెట్టారు. తన టాలెంటుతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. నటించడం ద్వారా భారీగా సంపాదించారు. అయితే బోనీని పెళ్లి చేసుకునే సమయానికి ఆమె ఆస్తులన్నీ కరిగిపోయాయి.

  వారంతా ముంచారు

  వారంతా ముంచారు

  చిన్నతనంలో శ్రీదేవి నటన మొదలు పెట్టిన సమయం నుండీ ఆమె రెమ్యూనరేషన్, డబ్బు వ్యవహారాలు అన్నీ ఆమె తండ్రి చూసుకునేవారు. నిర్మాతలు బ్లాక్ మనీ ఇస్తుండటంతో ఆయన ఆ డబ్బును తనకు నమ్మకమైన స్నేహితులు, బంధువుల వద్ద ఉంచారు. అయితే ఆయన మరణం తర్వాత చాలా మంది డబ్బు తిరిగి ఇవ్వకుండా శ్రీదేవిని మోసం చేశారు.

  తల్లి వల్ల కూడా భారీగా నష్టం

  తల్లి వల్ల కూడా భారీగా నష్టం

  తండ్రి మరణం తర్వాత డబ్బు వ్యవహారాలు శ్రీదేవి తల్లి చూసుకునేవారు. ఆమె శ్రీదేవి డబ్బుతో చాలా వరకు లిటిగేషన్లో ఉన్న ఆస్తులు కొనుగోలు చేయడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందట. బోనీ కపూర్‌ను పెళ్లాడే సమయానికి ఆమె వద్ద పెద్దగా ఆస్తులు లేవని అంటుంటారు.

  సోదరి సగం లాక్కుంది

  సోదరి సగం లాక్కుంది

  శ్రీదేవి సోదరి తన పొరుగింటి కుర్రాడిని పారిపోయి పెళ్లి చేసుకుంది. దీంతో శ్రీదేవి డబ్బుతో తన పేరు మీద కొనుగోలు చేసిన ఆస్తులను మళ్లీ శ్రీదేవి పేరున రాస్తూ తల్లి వీలునామా రాసింది. తర్వాత శ్రీదేవి తల్లికి బ్రెయిన్ ఆపరేషన్ తప్పుగా జరుగడంతో ఆమె మెంటల్ పేషెంట్ అయ్యారు. అనంతరం శ్రీదేవి సోదరి ఆస్తులపై కోర్టుకెక్కారు. తన తల్లి మతిస్థిమితం లేని సమయంలో వీలునామా రాశారని, అది చెల్లదు అంటూ... శ్రీదేవికి మిగిలిన కొద్ది పాటి ఆస్తుల్లో సగం లాక్కున్నారు.

  బ్రాండ్ ఎండార్స్మెంట్ ద్వారా సంపాదన

  బ్రాండ్ ఎండార్స్మెంట్ ద్వారా సంపాదన

  బోనీ కపూర్‌తో వివాహం తర్వాత శ్రీదేవి సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. సినిమాలకు దూరం అయినా లక్స్, తనిష్క్ లాంటి బ్రాండ్లకు ప్రచారం చేసి మంచి ఆదాయం పొందారు.

  శ్రీదేవి-బోనీ ఇంటి ఖరీదు ఎంతో తెలుసా?

  శ్రీదేవి-బోనీ ఇంటి ఖరీదు ఎంతో తెలుసా?

  శ్రీదేవి, బోనీ కపూర్ నివాసం ముంబైలోని అంధేరి ప్రాంతంలో ఉంది. ఇక్కడ వారికి విలాసవంతమైన భవంతి ఉంది. ఈ ఇంటి ఖరీదు రూ. 220 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ఇంటి ముందు పోర్షే, ఆడి, ఫోర్డ్, బెంట్లీ బ్రాండ్లకు చెందిన ఖరీదైన కార్లు కొలువుదీరి ఉంటాయి.

  శ్రీదేవి సంవత్సర ఆదాయం

  శ్రీదేవి సంవత్సర ఆదాయం

  ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమా ద్వారా శ్రీదేవి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుండి పలు చిత్రాల్లో నటించారు. ఒక్కో సినిమాకు రూ. 3.4 కోట్ల నుండి రూ. 4.5 కోట్లు చార్జ్ చేశారట. రీ ఎంట్రీ తర్వాత ఆమె సంవత్సర ఆదాయం రూ. 13 కోట్లు ఉందని న్యూస్ రిపోర్ట్స్ ద్వారా వెల్లడవుతోంది.

  24 శాతం పెరిగిన ఆస్తులు

  24 శాతం పెరిగిన ఆస్తులు

  ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమాతో ఆమె రీ ఎంట్రీ తర్వాత ఆమె ఆస్తులు 24 శాతం మేర పెరిగినట్లు తెలుస్తోంది.

  రూ. 9 కోట్ల ఖరీదు చేసే కార్లు

  రూ. 9 కోట్ల ఖరీదు చేసే కార్లు

  శ్రీదేవి కుటుంబానికి పలు ఖరీదైన కార్లు ఉన్నాయి. అందులో రూ. 2 కోట్ల విలువ చేసే బెంట్లీ కారు కూడా ఉంది. అవన్నీ శ్రీదేవి పేరు మీదనే ఉన్నాయి. ఈ కార్ల విలువ రూ. 9 కోట్లు ఉంటుందని అంచనా.

  రూ. 62 కోట్ల విలువ చేసే మూడు బంగళాలు

  రూ. 62 కోట్ల విలువ చేసే మూడు బంగళాలు

  శ్రీదేవి పేరు మీద రూ. 62 కోట్ల విలువ చేసే బంగళాలు ఉన్నట్లు సమాచారం. శ్రీదేవికి సంబంధించిన ఆస్తులన్నీ ఇద్దరు కూతుళ్లకు సమానంగా చెందుతాయని సమాచారం.

  English summary
  Sridevi was one of the most popular and highly paid actress in the Bollywood industry.Sridevi's sudden demise has shocked the world. Many still are unable to believe that Bollywood's Chandni is no more. Veteran actor Sridevi died in Dubai on Saturday after a cardiac arrest. She was 54. Meanwhile check out the total property of Sridevi which she left behind!
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more