twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ గోపాల్ ‘శ్రీదేవి’ స్టోరీ ఇదే...(న్యూ పోస్టర్స్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం తాను తీస్తున్న ‘శ్రీదేవి' సినిమాతో సృష్టిస్తున్న వివాదం అంతా ఇంతా కాదు. చిన్నప్పుడు నేను మా సరస్వతి టీచర్ కి అట్రాక్ట్ అయ్యేవాడిని, దాన్ని బేస్ చేసుకుని ‘శ్రీదేవి' సినిమా చేస్తున్నాను అంటూ ఆయన చెప్పడంతో పెద్ద దుమారమే రేగింది. ఉపాధ్యాయ సంఘాలతో పాటు మహిళా సంఘాలు కూడా ఆందోళన చేపట్టాయి.

    వర్మ ఈ ఆందోళన కార్యక్రమాలు, విమర్శలపై తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు. కొంత మందికి నా సినిమా పోస్టర్ కంటే నా ప్రెస్ నోట్‌లో నేను ప్రస్తావించిన ‘సరస్వతీ టీచర్' అంశం ఎక్కువగా కోపం తెప్పించిందని తెలిసింది. నేను మల్లీ చెబుతున్నా..చిన్నప్పుడు నేను మా సరస్వతి టీచర్ కి అట్రాక్ట్ అయ్యేవాడిని. ఈ మాట నేను ఈ మధ్య ఆవిడకి కూడా చెప్పాను. ఆవిడ దాన్ని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే...‘యవ్వనం వికసిస్తున్న రోజుల్లో అలాంటి భావాలు కలుగడం చాలా సహజం' అనే ఇంగిత జ్ఞానం ఆవిడకు ఉంది కాబట్టి! ఆవిడకే ఏ సమస్య లేనప్పుడు, వేరే ఏమీ తెలియనివాళ్లకు ఏం సమస్యో...నాకు సమస్య అయ్యి కూర్చుంది.

    ఇక నా సినిమా పోస్టర్ చూసి, కథేమిటో వాళ్లే ఊహించేసుకుని...పోస్టర్ లో ఉన్న అమ్మాయి ‘టీచర్' అని ఫిక్సయిపోతే...అంతకన్నా వెర్రితనం లేదు. ప్రెస్ నోట్ లో అంత క్లియర్ గా నేను రాసిన తర్వాత కూడా అర్థం చేసుకోలేనంత నిరక్షరాస్యత వాళ్లలో ఉండటం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. మొత్తం సినిమా తీసాక, అందులో అభ్యంతరమైన సన్నివేశాలుంటే...ఆ వ్యవహారం చూడ్డానికి సెన్సార్ బోర్డ్ ఉంది. సెన్సార్ బోర్డ్ ను అధిగమించి...వీళ్లే నిర్ణయాలు తీసుకొంటామంటే..ఇక సెన్సార్ బోర్డ్ ఎందుకు?

    సినిమా పోస్టర్లలో కనిపించే ‘ఆ అమ్మాయి' టీచర్ అని వాళ్లకి వాళ్లే డిసైడ్ చేసుకున్నారు. విషయం ఏమిటంటే...సినిమా పాయింట్ ను చెప్పడానికి...‘నా టీనేజ్ లో నేను మొదటి ఆకర్షణకి లోనైన మా ఇంగ్లీష్ టీచర్ సరస్వతి మేడమ్ ని ఉదహరించడం జరిగింది. అంతే కానీ, పోస్టర్‌లో చూపించిన లేడీ..టీచర్ కాదు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా కథ..టీచర్-స్టూడింట్ మధ్య జరిగే కథ ఎంత మాత్రం కాదు!

    స్టోరీ ఇదే.....
    15 ఏళ్ల యువకుడు 25 ఏళ్ల మహిళపై ఆకర్ణణ పెంచుకుంటాడు. ఆమె ఒక సాధారణ గృహిణి. ఆమె భర్త ఒక బిజినెస్ మేన్. ఆ అబ్బాయి వాళ్ల పక్కింటి వాళ్ల అబ్బాయి. యవ్వనం వికసిస్తున్న రోజుల్లో చుట్టు ఉన్న పరిస్థితులు అతన్ని ఎలా ప్రభావితం చేసాయి. ఇప్పటి జీవన విధానం, సమాజంలోని పరిస్థితుల, టీవీ యాడ్లు అతనిపై ఎలాంటి ప్రభావం చూపించాయి అనే కాన్సెప్టుతో సినిమా సాగుతుందని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. ఈ సినిమాలో 25 ఏళ్ల మహిళ పాత్రలో అనుకృతి వర్మ తొలిసారిగా నటిస్తోంది.

    స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఫోటోలు....

    నిర్మాతలు

    నిర్మాతలు

    ‘శ్రీదేవి' చిత్రాన్ని కాస్మిక్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.

    దర్శకత్వం...

    దర్శకత్వం...

    శ్రీదేవి చిత్రానికి కిరణ్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు.

    కాన్సెప్టు

    కాన్సెప్టు

    15 ఏళ్ల యువకుడు 25 ఏళ్ల మహిళపై ఎలా ఆకర్షణ పెంచుకున్నాడు అనేది సినిమా కాన్సెప్టు.

    సహజమే అంటున్న వర్మ

    సహజమే అంటున్న వర్మ

    చిన్నప్పుడు నేను మా సరస్వతి టీచర్ కి అట్రాక్ట్ అయ్యేవాడిని. ఈ మాట నేను ఈ మధ్య ఆవిడకి కూడా చెప్పాను. ఆవిడ దాన్ని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే...‘యవ్వనం వికసిస్తున్న రోజుల్లో అలాంటి భావాలు కలుగడం చాలా సహజం' అంటన్నారు వర్మ.

    సావిత్రి పేరు మార్చి శ్రీదేవి అని పెట్టారు

    సావిత్రి పేరు మార్చి శ్రీదేవి అని పెట్టారు

    ‘సావిత్రి' పేరును టైటిల్ గా పెట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తపరిచారు. ఎందుకంటే...పురాణాల్లో సావిత్రి పతివ్రత కాబట్టి అని చెప్పారు. అలా అయితే మిగతా పేర్లు గల మహిళలెవరూ పతివ్రతలు కాదని వాల్లు చెప్పకనే చెప్పడం సభ్య సమాజానికి సిగ్గు చేటు అన్నారు వర్మ.

    టీచర్ గురించి కాదు

    టీచర్ గురించి కాదు

    సినిమా పాయింట్ ను చెప్పడానికి...‘నా టీనేజ్ లో నేను మొదటి ఆకర్షణకి లోనైన మా ఇంగ్లీష్ టీచర్ సరస్వతి మేడమ్ ని ఉదహరించడం జరిగింది. అంతే కానీ, పోస్టర్‌లో చూపించిన లేడీ..టీచర్ కాదు అన్నారు వర్మ.

    చైల్డ్ ఆర్టిస్ట్

    చైల్డ్ ఆర్టిస్ట్

    సినిమా పోస్టర్ లో కనిపిస్తున్న అబ్బాయి నటుడు. ఇంతకు ముందు కూడా అతను సినిమాల్లో నటించాడు. నా సినిమాలో కూడ అతను తన తల్లిదండ్రుల అనుమతితో మరియు, వారి సమక్షంలో నటిస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ.

    అలా ఊహించుకోవద్దు

    అలా ఊహించుకోవద్దు

    ఈ సినిమా ముఖ్య ఉద్దేశ్యం...ఒక అబ్బాయి ప్రస్తుతం మన చుట్టూ ఉన్న ఆధునిక జీవనశైలి వలన ఏ విధంగా ప్రభావితమయ్యాడు? దాని వలన, ఆ అబ్బాయితో పాటు... అతని చుట్టూ ఉన్నవాళ్లు ఎలాంటి దుష్ర్పరిణామాలకు లోనయ్యారనేది చెప్పడం. ఇది తెలుసుకోకుండా కొంత మంది బాధ్యతారాహిత్యంతో, సినిమాలో లేని విషయాలను ఉన్నట్లుగా తమకుతాముగా ఊహించేసుకుని...టీవీలలో ఇంటర్వ్యూలు ఇస్తున్నారని వర్మ మండి పడ్డారు.

    త్వరలోనే విడుదల

    త్వరలోనే విడుదల

    త్వరలోనే ఈచిత్రం విడుదల విశేషాలు ప్రకటించనున్నారు రామ్ గోపాల్ వర్మ.

    English summary
    'Sridevi' produced by Cosmic pictures and directed by Kiran Prasad is about a 15 year old boy's infatuation towards a 25 yearold woman.. ..The woman is just a simple house wife married to a businessman and the boy is a neighbours son ...the age of the boy issuch that he is just sexually awakening and the film is about how he gets affected due to his exposure to pornography and various such other things present in today's culture and also about how he is influenced by such things as glamorous heroines and also due to advertisers using sex to sell their various products ...the woman who is playing the title role is a first time actress named Anukriti Sharma.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X