»   » హీరోయిన్ శ్రీదేవి రివేంజ్ తీర్చుకోబోయేది ఎవరిపై...?

హీరోయిన్ శ్రీదేవి రివేంజ్ తీర్చుకోబోయేది ఎవరిపై...?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sridevi
హైదరాబాద్: ఒకప్పుడు భారతీయ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు విలిగిన హీరోయిన్ శ్రీదేవి, బోనీకపూర్‌ను పెళ్లాడిన తర్వాత సినిమాలకు దూరమైంది. దాదాపు 15 ఏళ్ల విరామం తర్వాత 'ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రం ద్వారా అక్టోబర్ 5, 2012న మళ్లీ వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా తనలో అందం, నటించే సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకుంది.

'ఇంగ్లిష్ వింగ్లిష్' తర్వాత శ్రీదేవి మళ్లీ ఏ సినిమాలోనూ నటించలేదు. తనకు పర్‌ఫెక్టుగా సూటయ్యే కథ వస్తే తప్ప చేయను అంటూ బీష్మించుకున్న కూర్చున్న ఆమె ఈ గ్యాప్‌లో ఖాళీగా ఉండకుండా గ్లామర్ ప్రపంచంలో తదనైన ముద్ర వేస్తూ వివిధ కార్యక్రమాల్లో సందడి చేస్తూ వచ్చింది.

శ్రీదేవి తాజాగా మరో సినిమాకు కమిటైనట్లు బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో ఆమె ఓ రివేంజ్ డ్రామా కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని అంటున్నారు. శ్రీదేవికి ఈ స్టోరీ బాగా నచ్చడంతో ఓకే చెప్పిందని....పెళ్లైన మహిళ, ఆమె ఇద్దరు కూతుర్ల చుట్టూ ఈ కథ తిరుగుతుందని సమాచారం.

ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా వివరాలు త్వరలో అపీషియల్‌గా వెల్లడికానున్నాయి. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనేది ఇంకా ఖరారు కాలేదు. శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మిస్తారని అంటున్నారు. శ్రీదేవి వయసు, బాడీ లాంగ్వేజ్‌కు సూటయ్యే విధంగా ఈ సినిమా ఉండనుందట. తెలుగు, తమిళం, హిందీ బాషల్లో ఈచిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది.

English summary
Sridevi next movie details revealed. Sridevi will be seen playing the lead in a revenge drama post the super successful comeback 'English Vinglish'. This untitled flick revolves arouna a married woman with two daughters.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu