అందాల అతిలోక సుందరి మళ్లీ వచ్చేస్తోంది..!?
ఎప్పట్నుంచో మళ్లీ నటిగా రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న శ్రీదేవికి ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. అతిలోక సుందరి, అందాలరాశి శ్రీదేవి మళ్లీ ప్రేక్షకులని మురిపించి, అలరించడానికి వెండితెరకు వేంచేస్తోంది. సుమారు పద్నాలుగేళ్ళ సుదీర్ఘవిరామం అనంతరం ఆమె మళ్లీ ముఖానికి రంగేసుకోనుంది. బాలీవుడ్ ఫిలిం మేకర్ బాల్కీ భార్య గౌరీ షిండే దర్శకత్వం వహించే ఈ చిత్రం పేరు 'ఇంగ్లిష్-వింగ్లిష్'. ఈ చిత్రం షూటింగును జూలై 7 న ముంబైలో ఘనంగా ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
నిజానికి మిస్టర్ ఇండియా సీక్కెల్ తో శ్రీదేవి రీఎంట్రీని బోనీ కపూర్ ప్లాన్ చేయగా చివరకు ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో అది కార్యరూపం దాల్చుతోంది. ఈ చిత్ర కథ శ్రీదేవి పాత్ర చుట్టూ నడుస్తుందని తెలుస్తోంది. ఈ స్క్రిప్ట్ తనకి బాగా నచ్చడం వల్లే దీనిని శ్రీదేవి యాక్సప్ట్ చేసిందట.
స్లిమ్ గా ఉండటానికి కారణం మళ్లీ సినిమాల్లోకి రావాలనే కోరిక కాదని, తన కూతుళ్లు ఇద్దరికీ ఫిజికల్ ఫిట్ నెస్ పట్ల అవగాహన ఎక్కువని, అందుకే తను కూడా వారిలా ఆరోగ్యం విషయంలో శ్రద్ద పెడుతున్నానని శ్రీదేవి చెప్పింది. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సో... శ్రీదేవి అభిమానులకు ఇక పండగే!


Click it and Unblock the Notifications











