»   » వ్యాంపు పాత్రలో శ్రీదేవిని ఊహించుకోగలమా?

వ్యాంపు పాత్రలో శ్రీదేవిని ఊహించుకోగలమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని పరిశ్రమల్లోనూ ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి తన నటన, గ్లామర్‌తో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. బోనీ కపూర్‌ను పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన శ్రీదేవి....దాదాపు 15 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది.

తన వయసుకు తగిన పర్‌ఫెక్టు పాత్రలో 'ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి....తనలో సత్తా తగ్గలేదని మరోసారి నిరూపించుకుంది. దీంతో మళ్లీ ఆమెకు పలు సినిమాల్లో ఆఫర్లు రావడం మొదలయ్యాయి. అయితే శ్రీదేవి మాత్రం 'ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రం తర్వాత మరే సినిమాకు కూడా సైన్ చేయలేదు.

తాజాగా బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ తన తర్వాతి సినిమా 'ఫితూర్'లో శ్రీదేవికి నెగెటివ్ పాత్ర ఆఫర్ చేసాడట. వ్యాంపు పాత్ర మాదిరి క్యారెక్టరైజేషన్ ఉండే పాత్ర అది. అయితే ఆ పాత్ర చేయడానికి శ్రీదేవి నో చెప్పినట్లు సమాచారం. శ్రీదేవి నిర్ణయంపై కరెక్టే అని...పలువురి అభిప్రాయం. ఆమెను నెగెటివ్, వ్యాంపు పాత్రలో చూసి అభిమానులు తట్టుకోగలరా..?

English summary

 Bollywood actress Sridevi, who plays diverse roles with perfection, is not comfortable donning a negative avatar. The actress has reportedly refused to play a negative character in Abhishek Kapoor's next film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu