శ్రీదేవి కూతురు జాహ్నవి రచ్చ రంబోలా.. నైట్ పార్టీలో మళ్లీ కొత్త వ్యక్తితో..
సినీ నటి శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ విందులు, వినోదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారానికో వీడియోనో, ఫొటోనో మీడియాలో వైరల్‌గా మారుతూ ఉంటుంది.
సినీ నటి శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ విందులు, వినోదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారానికో వీడియోనో, ఫొటోనో మీడియాలో వైరల్‌గా మారుతూ ఉంటుంది. గతంలో బాయ్‌ఫ్రెండ్ అతిచనువుగా పార్టీలో డ్యాన్స్ చేయడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. తాజాగా ఓ పెళ్లి వేడుకగా భావిస్తున్న పార్టీలో ఓ కొత్త వ్యక్తితో రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్నది.

బాలీవుడ్‌లో దుమ్ము రేపడం..
పెళ్లి వేడుకలో జాహ్నవి హోయలు ఒలికిస్తూ చేసిన డ్యాన్స్ శ్రీదేవి అభిమానులకు కన్నుల పండువగా మారింది. డాన్స్‌లో మంచి ఈజ్ చూసిన వారంతా బాలీవుడ్ తెరపై జాహ్నవి దుమ్ము రేపడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

పెళ్లి వేడుకలో..
తన స్నేహితురాలు అనుష్క రాజన్ పెళ్లి వేడుకలో జాహ్నవి పాల్గొన్నట్టు సమాచారం. ఆ పెళ్లి వేడుకలోనే జాహ్నవి వీర లెవెల్లో చిందేసిన్నట్టు వీడియోలో స్పష్టమైంది. అయితే జాహ్నవితో డ్యాన్స్ చేసిన మరో వ్యక్తి ఎవరు అనేది ఇంకా ప్రశ్నగానే మిగిలింది. కాగా అనుష్క రాజన్ తమ్ముడు అక్షత్ రాజన్ సోదరుడితో కొంతకాలం డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి.

గతంలో ప్రియుడు శిఖర్ ..
గతంలో తన ప్రియుడని ప్రచారం అవుతున్న శిఖర్ పహారియాతో ఓ పార్టీలో చేసిన డ్యాన్స్ మళ్లీ హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. జాహ్నవి, పహారియా డ్యాన్స్ చేస్తున్న వీడియోను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేయగా విపరీతంగా లైక్‌లు వచ్చిపడ్డాయి.

బాలీవుడ్ ఎంట్రీకి ఏర్పాట్లు..
కాగా జహ్నవి బాలీవుడ్ ఎంట్రీకి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరణ్ జోహర్ పర్యవేక్షణలో జాహ్నవి తొలి చిత్రం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రానికి తండ్రి బోని కపూర్ నిర్మాత అనే మాట వినిపిస్తున్నది. మరాఠీలో సూపర్ హిట్ అయిన సైరత్ చిత్రం రీమేక్‌లో జాహ్నవి నటించనున్నదనే వార్త బలంగా ప్రచారంలో ఉంది.


Click it and Unblock the Notifications











