»   » వీడియో: అర్ధరాత్రి శ్రీదేవి కూతురు.. ప్రియుడితో రెచ్చిపోయి డ్యాన్స్

వీడియో: అర్ధరాత్రి శ్రీదేవి కూతురు.. ప్రియుడితో రెచ్చిపోయి డ్యాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ ఇంకా వెండితెరపైకి రాకముందే ఆమె వ్యవహారాలు సంచలనం రేపుతున్నాయి. ఇటీవల తన ప్రియుడు శిఖర్ పహారియాతో ఓ పార్టీలో చేసిన డ్యాన్స్‌ మళ్లీ హాట్‌ టాపిక్‌గా మారింది. జాహ్నవి, పహారియా ఉన్న వీడియోను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఆ వీడియోకు విపరీతంగా లైక్ వస్తున్నాయి.

పార్టీలో జాహ్నవి రెచ్చిపోయి డ్యాన్స్

19 ఏండ్ల జాహ్నవి డ్యాన్స్ ఫ్లోర్‌పై రెచ్చిపోయి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రియుడు శిఖర్ పహారియాతో పార్టీకి హాజరైన జాహ్నవి మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన డ్రస్‌ను ధరించి బ్యూటిఫుల్‌గా కనిపించింది. తుమ్కాలు ఇస్తూ డ్యాన్స్ చేస్తుండగా ప్రియుడు లయబద్ధంగా జోష్ పెంచడం విపరీతంగా ఆకట్టుకొంటున్నది.

పహారియా అఫైర్ రూమర్లకు తెర

పహారియా అఫైర్ రూమర్లకు తెర

పహారియాతో జాహ్నవికి అఫైర్ ఉందంటూ వచ్చిన రూమర్లకు తాజా వీడియో తెరదించేలా కనిపించింది. గత కొద్దికాలంగా బహిరంగంగానే వీరద్దరూ కనిపించడం ముంబైకి మీడియాకు పండగగా మారింది. జాహ్నవి, పహారియా ప్రేమకు శ్రీదేవి దంపతుల మద్దతు కూడా ఉందనే వాదన వినిపిస్తున్నది.

కరణ్ జోహర్ చిత్రంలో జాహ్నవి కపూర్

కరణ్ జోహర్ చిత్రంలో జాహ్నవి కపూర్

జాహ్నవి కపూర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్‌ రూపొందించే ఓ చిత్రంలో జాహ్నవి నటించనున్నట్టు ఆమె తండ్రి బోనీకపూర్ వెల్లడించారు. అయితే అధికారికంగా ప్రకటన చేయలేదు.

మరాఠీ చిత్రం సైరత్‌లో జాహ్నవి, ఇషాన్

మరాఠీ చిత్రం సైరత్‌లో జాహ్నవి, ఇషాన్

మరాఠీలో సంచలన విజయం సాధించిన సైరత్ రీమేక్‌లో జాహ్నవి కపూర్, షాహీద్ కపూర్ సోదరుడు ఇషాన్‌ జంటగా నటించనున్నారనే వార్త బాలీవుడ్‌లో ఇటీవల గుప్పుమన్నది. అయితే ఆ వార్తలను ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ ఖండించారు. 'జాహ్నవి, ఇషాన్ తెరపైన సరైన జంటగా అనిపించరు. వారిని వేర్వేరు చిత్రాల్లో నటింపజేస్తాను' అని కరణ్ అన్నారు.

English summary
19-year-old Jhanvi Kapoor, the elder daughter of Sridevi, might be making her Bollywood debut very soon. she appeared hot with his boyfriend Shikhar Pahariya. Designer Manish Malhotra uploaded a video of the dance on Instagram and boy, it is super-duper hot!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu