శ్రీదేవిపై అభిమానంతోనే ఆ స్టార్ హీరో గ్రీన్ సిగ్నల్
ముంబై : ఒకప్పటి ఆలిండియా టాప్ హీరోయిన్ శ్రీదేవి త్వరలో 'ఇంగ్లీష్ వింగ్లిష్' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం ట్రైలర్ యూట్యూబ్‌లో మిలియన్ హిట్స్ సొంతం చేసుకుంది. దీన్ని బట్టి ఈ చిత్రంపై అభిమానుల్లో ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ చిత్రం గురించి దర్శక నిర్మాతలు బాల్కీ-గౌరీ షిండే మాట్లాడుతూ... 'సౌత్ లో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న అజిత్ శ్రీదేవికి పెద్ద ఫ్యాన్. అలాగే అమితాబ్ వచ్చన్‌కి అజిత్ పెద్ద అభిమాని. అతిలోక సుందరి శ్రీదేవి చాలా గ్యాప్ తర్వాత 'ఇంగ్లీష్ వింగ్లీష్'తో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రం హిందీ వెర్షన్ లో అమితాబ్ బచ్చన్ ఓ స్పెషల్ రోల్ చేసారు. తెలుగు, తమిళ భాషల్లో ఆ రోల్‌ని అజిత్ చేసారు.
తాను ఎంతో బిజీగా ఉన్నప్పటికీ శ్రీదేవి మీదున్ప అభిమానంతో ఈ స్పెషల్ రోల్ చెయ్యడానికి అంగీకరించిన అజిత్ కి మేం స్పెషల్ థాంక్స్ చెబుతున్నాం. ఈ స్పెషల్ అప్పియరెన్స్ కోసం అజిత్ ముంబయికి వచ్చి, షూటింగ్ స్పాట్‌కి తన సొంత కారులోనే అప్పియరెన్స్ కోసం సొంత కాస్ట్యూమ్స్ వేసుకుని 12 గంటల పాటు షూటింగులో పాల్గొన్నారు. ఎంతో సింపుల్ గా కనిపించే అజిత్‌ని చూసి సెట్‌లో అందరూ ఎంతో ఇంప్రెస్ అయిపోయారు.
అజిత్ అమితాబ్, శ్రీదేవిలకు ఫ్యాన్ అయితే ఈ షూటింగ్ పూర్తి చేసుకుని అజిత్ వెళ్లి పోయాక సెట్ లో అందరూ అజిత్ గురించే మాట్లాడుకుంటూ అజిత్ కి ఫ్యాన్స్ అయిపోయారు. ఇంగ్లీష్ వింగ్లీష్ తెలుగు, తమిళ భాషల్లో అజిత్ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వడం ఓ హైలెలట్ గా చెప్పుకోవాలి. అటు శ్రీదేవి అభిమానులకు, ఇటు అజిత్ అభిమానులకు ఇది ఓ గుడ్ న్యూస్. అక్టోబర్ 5న ఇంగ్లీష్ వింగ్లీష్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతుంది.' అన్నారు.
ఎక్కువ భాగం న్యూయార్క్ లో షూటింగ్ జరుపుకుంటున్న 'ఇంగ్లీష్ వింగ్లీష్' చిత్రంలో శ్రీదేవి, ఆదిల్ హుస్సేన్, ప్రియా ఆనంద్, మెహిదీ నెబ్బో నటిస్తున్నారు. సంగీతం: అమిత్ త్రివేది, సౌండ్: రసూల్ పూకుట్టి, ఫోటో గ్రఫీ: లక్ష్మణ్ ఉటేకర్, ఎడిటింగ్: హేమంతి సర్కార్, నిర్మాతలు: రాకేష్ జుంజుంవాలా, ఆర్.దమని, సునీల్ లుల్లా, ఆర్. బాల్కీ, రచన-దర్శకత్వం: గౌరీ షిండే.


Click it and Unblock the Notifications











