»   » శ్రీదేవి భౌతిక కాయానికి ఫోరెన్సిక్ పరీక్షలు: తేలనున్న నిజం, తర్వాతే అంత్యక్రియలు!

శ్రీదేవి భౌతిక కాయానికి ఫోరెన్సిక్ పరీక్షలు: తేలనున్న నిజం, తర్వాతే అంత్యక్రియలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీదేవికి ఎలాంటి హృద్రోగ సమస్యలు లేవు. ఇది కుటుంబ సభ్యులు చెబుతున్న మాట. ఈ మధ్య కాలంలో ఆమెకు ఎలాంటి అనారోగ్యం లేదు. క్రమం తప్పకుండా శ్రీదేవి హెల్త్ చెకప్ చేయించుకుంటారు. ఆమెకు హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉన్నట్లు వైద్యులకు ఎప్పుడూ ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. ఎంతో హెల్దీగా ఉన్న ఆమె సడెన్‌గా గుండెపోటుకు గురికావడానికి, అందులోనూ క్షణాల్లో ప్రాణాలు హరించేలా మాసివ్ స్ట్రోక్‌కు గురి కావడం వెనక అసలు వాస్తవాలు ఏమిటి? మరికొన్ని గంట్లలో ఈ నిజాలన్నీ తేలబోతున్నాయి.

శ్రీదేవి భౌతిక కాయానికి ఫోరెన్సిక్ పరీక్షలు

శ్రీదేవి భౌతిక కాయానికి ఫోరెన్సిక్ పరీక్షలు

శ్రీదేవి దుబాయ్‌లో మరణించడంతో అక్కడి చట్టాల ప్రకారం ముందు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో ఆమె మరణానికి గల కారణాలు ఏమిటి? ఉన్నట్టుండి గుండెపోటుకు గురి కావడానికి దారి తీసిన పరిణామాలు ఏమిటి? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే అంశాలపై వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

అనుమానాలన్నీ పటా పంచలు

అనుమానాలన్నీ పటా పంచలు

శ్రీదేవి మరణానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకున్నారు, ఎలాంటి పానీయాలు సేవించారు? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా?.... ఇలా అభిమానుల్లో నెలకొన్న అనుమానాలన్నీ ఫోరెన్సిక్ రిపోర్టుతో పటాపంచలను కానుంది.

గదిలో స్పృహ తప్పి పడిపోయిన శ్రీదేవి

గదిలో స్పృహ తప్పి పడిపోయిన శ్రీదేవి

మేనల్లుడు మోహిత్ మార్వా వివాహం కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో స్పృహకోల్పోయి కన్పించినట్లు ఆమె మరిది సంజీవ్‌ కపూర్‌ మీడియాకు వెల్లడించారు. వెంటనే దుబాయ్‌లోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించినట్లు తెలిపారు. శ్రీదేవికి గుండె సంబంధ వ్యాధులు ఏమీ లేవని తెలిపారు.

ప్రత్యేక విమానంలో ఇండియాకు శ్రీదేవి భౌతిక కాయం

ప్రత్యేక విమానంలో ఇండియాకు శ్రీదేవి భౌతిక కాయం

ముంబయి విమానాశ్రయం నుంచి ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ప్ర్యతేక విమానం దుబాయ్‌ బయలుదేరింది. విమానం 4 గంటలకు దుబాయ్‌ చేరుతుందని అక్కడి నుంచి శ్రీదేవి భౌతికకాయంతో రాత్రి 8 గంటలకు భారత్‌ చేరుకుంటుంది.

అంత్యక్రియలు ఎప్పుడు?

అంత్యక్రియలు ఎప్పుడు?

శ్రీదేవి అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయి అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఆదివారం రాత్రి భౌతిక కాయం ముంబై చేరుకుంటుంది. అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం తర్వాత సోమవారం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. శాంతాక్రూజ్ స్మశానవాటికలో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.

భారీగా అభిమానులు

భారీగా అభిమానులు

ఇప్పటికే శ్రీదేవి మరణవార్త తెలిసినప్పటి నుండి ముంబైలోని శ్రీదేవి నివాసం వద్దకు అభిమానులు పోటెత్తారు. ఆమె చివరి చూపు అయినా దక్కుతుందనే ఆశతో చాలా మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు.

భారీగా భద్రతా ఏర్పాట్లు

భారీగా భద్రతా ఏర్పాట్లు

ఆదివారం రాత్రికి శ్రీదేవి భౌతిక కాయం ఇండియాకు రానుండటం, ప్రముఖుల సందర్శన, అభిమానుల తాకిడి ఉండనున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. వందల సంఖ్యలో పోలీసులు రంగంలోకి దిగారు.

English summary
Veteran actress' Sridevi body to be flown back to Mumbai from Dubai today. As per reports, Sridevi's funeral will be performed at the Santacruz crematorium. Many celebrities and family members will be attending the funeral to pay their last tributes to the veteran actress.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu