»   » అతిలోక సుందరికి అదంటే చాలా ఇష్టం, అందుకే అంత్యక్రియల్లో కూడా!

అతిలోక సుందరికి అదంటే చాలా ఇష్టం, అందుకే అంత్యక్రియల్లో కూడా!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sridevi's Last Rites : Everything You Wanted To Know

ప్రముఖ నటి శ్రీదేవి శనివారం అర్దరాత్రి మరణించినప్పటికీ దుబాయ్ నిబంధనల ప్రకారం ఫార్మాలిటీస్ పూర్తికావడానికి ఆలస్యం అవుతోంది. దీంతో ఆమె భౌతిక కాయం సోమవారం రాత్రికి ముంబై చేరే అవకాశం కనిపిస్తోంది. మంగళవారం ఉదయం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. శ్రీదేవి అంత్యక్రియల్లో తెలుపు రంగు తప్ప మరే రంగు కూడా కనిపించకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 శ్రీదేవికి అదంటే చాలా ఇష్టం

శ్రీదేవికి అదంటే చాలా ఇష్టం

శ్రీదేవికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం. ఆమె ధరించే దుస్తువుల విషయంలో అయినా, మరే విషయంలో అయినా దానికే ఎక్కువ ప్రధాన్యత ఇస్తారట. దీంతో వైట్ థీమ్‌తో అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

 ప్రతిదీ అదే రంగుంలో...

ప్రతిదీ అదే రంగుంలో...

అంత్యక్రియల్లో వాడే ఫ్లవర్స్, ఇతర వస్తువులు తెలుపు రంగులోనే ఉండేట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి కూడా తెలుపు రంగు దుస్తుల్లోనే హాజరుకావాలని సూచనలు చేసినట్లు సమాచారం.

 ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని

ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని

శ్రీదేవి అంత్య క్రియల్లో ఆమెకు ఇష్టమైన వస్తువులు, రంగులకు ప్రధాన్యం ఇస్తూ నిర్వహిస్తారని, ఆమె ఆత్మకు శాంతి చేకూరే విధంగా అంతిమ సంస్కారాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖులంతా ముంబైకి

ప్రముఖులంతా ముంబైకి

శ్రీదేవి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు దక్షిణాది పరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులతో పాటు షూటింగ్స్ నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉన్న బాలీవుడ్ స్టార్స్ సైతం ముంబై చేరుకుంటున్నారు. ఆమె భౌతిక కాయానికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మంగళవారం అంత్యక్రియలు?

మంగళవారం అంత్యక్రియలు?

సోమవారం రాత్రికి గానీ శ్రీదేవి భౌతిక కాయం ఇండియా వచ్చే అవకాశం లేక పోవడంతో మంగళవారం ఉదయం శ్రీదేవి అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. మరికొన్ని గంటల్లో ఈ విషయమై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

English summary
The Indian Consulate is working closely with the Dubai authorities in completing all the legal formalities in bringing Sridevi's mortal remains back to India and it is now reported that her family is planning for a complete white funeral and will fill the motorcade which carries her mortal remains with white flowers. ABP News quoted a source by saying that it was Sridevi who wanted everything to be in white when she was alive and gave much importance to that particular colour. The source revealed that her family is trying to do everything to fulfil her wishes and will drape everything in white, so that Sridevi's soul can be at peace.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu