Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
హడులెత్తిస్తున్న శ్రీదేవి నెల ఖర్చు.. దివాళా స్దితిలో భర్త బోనీ
హీరోయిన్ గా రిటైరై కుటుంబ జీవితాన్ని గడుపుతున్న శ్రీదేవి నెలసరి కుటుంబ ఖర్చు దాదాపు పాతిక లక్షల వరకూ ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆమె భర్త ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఆర్ధిక కష్టాల్లో పడి సినిమాలు తీయటం మానుకుని ఓ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ కు హెడ్ గా జాబ్ లో జాయిన్ కాబోతున్నారు. బోనీకపూర్ రీసెంట్ గా సల్మాన్ ఖాన్ తో తీసిన పోకిరి రీమేక్ వాంటెడ్ మంచి హిట్ అయి లాభాలు తెచ్చిపెట్టినప్పటికి అప్పటికే పేరుకుపోయిన అప్పుల నుంచి అది బయిటకు లాగలేకపోయిందని తెలుస్తోంది. మరో ప్రక్క జెనీలియా, అర్మన్ బవేజాలతో తీస్తున్న సినిమా ఫైనాన్స్ సమస్యతో ఎంత కాలం ఉన్నా పూర్తి కావటం లేదు.
ఈ స్దితికి కారణం కేవలం శ్రీదేవి పెంచుకుంటూ వెళ్ళిపోయిన ఖర్చేనని అంటున్నారు. హీరోయిన్ గా వెలుగుతున్న రోజుల్లో లాగానే ఇప్పటికీ మహారాణిలా ఆమె తన ఇంటివద్ద బిహేవ్ చేస్తోందని అదే కొంప ముంచుతోందని చెప్తున్నారు. ముఖ్యంగా శ్రీదేవీ తను ధరించే దుస్తులకే భారీగా ఖర్చు పెడతోంది. అలాగే ముంబైలో వారానికి ఒకసారైనా సరే.. తన కుమార్తె జాహ్నవితో కలసి ఒక బ్యూటీ క్లినిక్ ను సందర్శిస్తుంది. ఇక కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన ప్రతీ కారు కొనాల్సిందే. దీనికి తోడు ప్రతి సంవత్సరం.. యూరప్ లేదా అమెరికా వెళ్లి.. సెలవుల్లో ఫైవ్ స్టార్ వసతులున్నచోట గడుపుతుంది. ఇక తన భర్త పడుతున్న ఇబ్బందులనుంచి బయిటపడేయటానికే శ్రీదేవి మళ్ళీ రీఎంట్రీ ఇస్తోంది. ఆమె కొత్త సినిమా జులై 7 న తన సినిమా షూటింగ్ మొదలవుతోంది.