రామ్ గోపాల్ వర్మకు షాకిచ్చిన హీరోయిన్ శ్రీదేవి!
హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మకు ప్రముఖ హీరోయిన్ శ్రీదేవి, బోనీ కపూర్ షాక్ ఇచ్చింది. వర్మ తీస్తున్న సినిమాకు తన పేరు ‘శ్రీదేవి' అనే టైటిల్ పెట్టడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ మేరకు వర్మకు తన లాయర్ ద్వారా లీగల్ నోటీసులు పంపారు. వెంటనే సినిమా టైటిల్ మార్చాలని, లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఇండియన్ సినిమా పరిశ్రమలో పేరు ప్రఖ్యాతలు ఉన్న తన క్లయింట్ (శ్రీదేవి) పేరును వాడుకోవడం ఆమె ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉందని, మీ సినిమా(శ్రీదేవి) వల్గర్‌గా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఆందోళన చెలరేగిన నేపథ్యంలో ‘శ్రీదేవి' టైటిల్ తొలగించాలని కోరుతున్నాం, లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శ్రీదేవి లాయర్ నోటీసుల్లో పేర్కొన్నారు.

15 ఏళ్ల కుర్రాడు యవ్వనం వికసిస్తున్న రోజుల్లో తనకంటే పెద్దదైన 25 ఏళ్ల మహిళ వైపు ఎలా అట్రాక్ట్ అయ్యాడు అనే అంశంతో రామ్ గోపాల్ వర్మ సినిమా ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలుతు ఈ చిత్రానికి ‘సావిత్రి' అనే టైటిల్ పెట్టారు. టైటిల్‌పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసారు. సినిమా పోస్టర్లు వల్గర్‌గా ఉండటంతో పలవురు అభ్యంతరం వ్యక్తం చేసారు. చైల్డ్ రైట్స్ కమీషన్ నుండి కూడా వర్మకు నోటీసులు అందాయి. దీంతో సినిమా టైటిల్ ‘శ్రీదేవి' అంటూ మార్చారు.
‘శ్రీదేవి' టైటిల్ వాడుకోవడంపై హీరోయిన్ శ్రీదేవి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో...రామ్ గోపాల్ వర్మ నెక్ట్స్ ఏం చేయబోతున్నారనే అంశం హాట్ టాపిక్ అయింది. శ్రీదేవితో పలు సినిమాలు తీసిన వర్మ....అనేక సందర్భాల్లో శ్రీదేవి అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. మరి శ్రీదేవి నుండి లీగల్ నోటీసులు అందుకున్న వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











