twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీదేవికి తేడా కొట్టిన ప్లాస్టిక్ సర్జరీ!.. దారుణంగా ముఖం.. వివరణ ఇచ్చిన అందాల తార

    By Rajababu
    |

    Recommended Video

    శ్రీదేవికి తేడా కొట్టిన ప్లాస్టిక్ సర్జరీ ! వివరణ ఇచ్చిన అందాల తార..!

    భారతీయ సినీ పరిశ్రమలో అలనాటి అందాల తార శ్రీదేవికి ఇప్పటికీ ఎదురే లేదు. ఈతరం నటీమణులకు కూడా శ్రీదేవి గట్టిపోటి ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అలాంటి అందాల సుందరి ఇటీవల అనురాగ్ బసు నిర్వహించిన సరస్వతి పూజకు హాజరైంది. అయితే సాధారణంగా కాకుండా ఆమె పెదవి లావెక్కి ఉండటం, ముఖం కొంత వాచిపోయి కనిపించడంతో మీడియా దృష్టి ఆమెపై పడింది. ఏదైనా సర్జరీ చేసుకొంటే తేడా జరిగిందా అని ఆరా తీశారు. అందుకు శ్రీదేవి ఇచ్చిన వివరణ ఇది..

     ప్లాస్టిక్ సర్జరీ తేడా..

    ప్లాస్టిక్ సర్జరీ తేడా..

    ప్లాస్టిక్ సర్జరీ తేడా కొట్టిందంటూ తనపై మీడియాలో వస్తున్న వార్తలో వాస్తవం లేదు. నేను చాలా ఆనందంగా ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాను. అదే నా ముఖంలో కనిపిస్తున్నది. గతంలో కంటే నేను ఎప్పడు చాలా అందంగా కనిపిస్తున్నాను. చాలా రోజులుగా నేను ఇది గమనించాను. అంతేకానీ ప్లాస్టిక్ సర్జరీ బెడిసికొట్టడం వల్ల కాదు అని శ్రీదేవి వెల్లడించింది.

    సంతోషంగా జీవితం

    సంతోషంగా జీవితం

    గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాను. ప్రశాంతంగా ఉన్న నా హృదయస్పందన నా ముఖంపై కనిపిస్తున్నది. ఇప్పుడు నా దైనందిక జీవితం గాడిలో పడింది. ఆరోగ్యంపై పూర్తిస్థాయిలో దృష్టిని పెట్టాను అని శ్రీదేవి చెప్పింది.

     పవర్ యోగా, టెన్నీస్

    పవర్ యోగా, టెన్నీస్

    వారంలో నాలుగు రోజులు పవర్ యోగా చేస్తాను. టెన్నీస్ ఆడుతాను. ఆహారంపై కంట్రోల్‌గా ఉన్నాను. స్వీట్లు, వేపుడు పదార్థాలను, జంక్ ఫుడ్‌ను పూర్తిగా దూరం పెట్టాను అని శ్రీదేవి పేర్కొన్నది.

     సౌందర్య రహస్యం ఇదే

    సౌందర్య రహస్యం ఇదే

    నా ఆరోగ్యం, సౌందర్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నేను గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా అందంగా కనిపిస్తున్నాను. దాంతోనే నా సౌందర్యంలో బాగా మార్పులు కనిపిస్తున్నాయి.

     వాస్తవాలు తెలుసుకోండి

    వాస్తవాలు తెలుసుకోండి

    వాస్తవాలు తెలుసుకోకుండా సెలబ్రిటీల జీవితాల్లోకి మీడియా తొంగిచూడకూడదు. వారి వ్యక్తిగత విషయాలను తప్పుడుగా చిత్రీకరించకూడదు. ఒకరి వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించడం తప్పు. తెలియని విషయాలపై రాయకూడుదు. మీ ప్రవర్తన మార్చుకొవాల్సిన అవసరం ఉంది.

     ప్లాస్టిక్ సర్జరీలతో

    ప్లాస్టిక్ సర్జరీలతో

    ప్లాస్టిక్ సర్జరీలతో అందాన్ని ఎన్నో రోజులు కాపాడుకోలేం. ప్రకృతి సిద్ధంగానే సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవాలి. కృత్రిమంగా ప్రయత్నాలు చేస్తే ఆరోగ్యానికి హానికరం అని శ్రీదేవి అభిప్రాయపడ్డారు.

    నేను జిమ్‌కు వెళ్లను

    నేను జిమ్‌కు వెళ్లను

    కొవ్వు పదార్థాలు తినడం ఆపితే జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అందుకే నేను ఆయిల్ ఫుడ్ తీసుకోను. జిమ్ వెళ్లకుండా జాగ్రత్త పడుతాను. ఆహార నియమాలను బోనికపూర్ చక్కగా పాటిస్తాడు. అందుకే ఆయన నాకు ప్రపంచంలోనే అందగాడిగా కనిపిస్తాడు.

     కెరీర్ ఆరంభంలో

    కెరీర్ ఆరంభంలో

    ఇదిలా ఉండగా, కెరీర్ ఆరంభంలో ముక్కు, పెదవులకు శ్రీదేవి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొన్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాతనే ఆమె మరింత అందంగా కనిపించారని అప్పట్లో మీడియా కోడైకూసింది.

    English summary
    Sridevi is still known as one of the most attractive actresses of Bollywood. The actress, who won accolades for her in Mom, was recently spotted at Anurag Basu's Saraswati Pooja. In her latest appearance, the actress's lips looked fuller than before. And she looked completely recognizable. Check out her recent pictures here.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X