శ్రీదేవిని పెళ్లి చేసుకోమని వాళ్ల అమ్మ అడిగింది.. రహస్యం బయట పెట్టిన జేడీ!

Recommended Video

Sridevi Mother Asked Me To Marry Sridevi' Says J.D.Chakravarthy || Filmibeat Telugu

అతిలోక సుందరిగా ఇండియన్ సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి అప్పట్లో ఎంతో మందికి కలల రాణి. ఆమెను పెళ్లి చేసుకోవాలని చాలా మంది ప్రముఖులు ట్రై చేశారు. కానీ ఎవరికీ దక్కలేదు, ఎవరూ ఊహించని విధంగా ఆమె బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ను రెండో పెళ్లి చేసుకుని సెటిలయ్యారు.

తాజాగా నటుడు జేడీ చక్రవర్తి ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఓ సంచలన విషయం బయట పెట్టారు. 'హిప్పీ' మూవీ ప్రమోషన్లో భాగంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీదేవి తల్లి తన దగ్గరకు వచ్చి నా కూతురును పెళ్లి చేసుకోవాలని అడిగినట్లు వెల్లడించారు.

ఆ విషయంలో వర్మకు, నాకు గొడవ జరిగేది

ఆ విషయంలో వర్మకు, నాకు గొడవ జరిగేది

ఇన్నేళ్ల జర్నీలో రాంగోపాల్ వర్మతో నేను గొడవ పడటం కానీ, విబేధాలు రావడం కానీ ఎప్పుడూ జరుగలేదు. అయితే శ్రీదేవి విషయంలో మా ఇద్దరికీ చిన్న గొడవలు జరుగుతూ ఉండేవి. ఇద్దరికీ శ్రీదేవి ఇష్టం. అదే అక్కడ సమస్య అయింది. క్షణక్షణం సినిమాకు వర్మ డైరెక్టర్ అనే విషయం మరిపోయి ఆమెను పటాయించడానికి కూడా ట్రై చేసినట్లు జేడీ గుర్తు చేసుకున్నారు.

వాళ్ల అమ్మ వచ్చి నా కూతురును పెళ్లి చేసుకోమని అడిగింది

వాళ్ల అమ్మ వచ్చి నా కూతురును పెళ్లి చేసుకోమని అడిగింది

ఇపుడు ఈ విషయం చెప్పకూడదు కానీ జరిగింది కాబట్టి చెబుతున్నాను. శ్రీదేవి గారి మదర్ వచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని నన్ను అడిగింది. ఆమె అలా అడగటంతో నేను కూడా షాకయ్యాను. అయితే ఆమె అలా ఎందుకు అడిగిందో తర్వాత అర్థమైంది. శ్రీదేవి అంటే ఇష్టమున్నా... ఆ సమయంలో ఆ చాన్స్ నాకు దక్కలేదని జేడీ తెలిపారు.

ఆమెకు మతిస్థిమితం సరిగా లేకపోవడం వల్లే

ఆమెకు మతిస్థిమితం సరిగా లేకపోవడం వల్లే

‘గులాబీ' సినిమా చేస్తున్న సమయంలో మహేశ్వరి, వాళ్ల మదర్ మద్రాసులో శ్రీదేవిగారి ఇంట్లోనే ఉండేవారు. అపుడు వారు నన్ను లంచ్‌కు పిలిస్తే వెళ్లాను. వెళ్లినపుడు శ్రీదేవిగారి మదర్ బ్రెయిన్లో తప్పుడు ఆపరేషన్ జరుగడం వల్ల మతిస్థిమితం సరిగా లేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ల అమ్మాయికి ఇంకా పెళ్లి జరుగలేదు అనే విషయం ఆమె మైండ్లో అలాగే ఉండిపోయినట్లు ఉంది. నేను ఎవరో ఏమిటో తెలియకుండానే నా రెండు చేతులు పట్టుకుని మా అమ్మాయిని పెళ్లి చేసుకోవా? అని అడిగారు.... అని జేడీ గుర్తు చేసుకున్నారు.

ఈ విషయం తెలిసి రామూగారు హర్ట్ అయ్యారు

ఈ విషయం తెలిసి రామూగారు హర్ట్ అయ్యారు

శ్రీదేవి మదర్ నన్ను ఇలా అడిగిందనే విషయం తెలిసి రామూగారు కాస్త హర్ట్ అయ్యారు. ఆ విషయం నన్ను అడిగి ఉండొచ్చు కదా అని ఫీలయ్యారు. రామూగారు ఉంటే ఆయన కూడా నాతో పాటు ఆ రోజు లంచ్‌కు వచ్చేవారు. అప్పుడు ఆయన బాంబేలో ఉండటంతో రాలేక పోయారని జేడీ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X