Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్‌కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ఒక్క ముద్దుకే చచ్చిపోతున్నారు: వైరల్ అవుతున్న శ్రీదేవి ముద్దుల ఫొటో
అలనాటి అందాల తార శ్రీదేవి భర్త బోనీకపూర్ ఉన్న ఓ మధురమైన చిత్రాన్ని అభిమానులతో పంచుకోగా, అదిప్పుడు వారి హృదయాలను కొల్లగొడుతూ వైరల్ అయింది.
Recommended Video
శ్రీదేవి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అన్న మార్క్ లేకుండా మొత్తం ఇండియన్ సెల్యులాయిడ్ మీదనే అందాల, నటనా సంతకం చేసిన నటి. గ్రేట్ డైరెక్టర్ అని పిలుచుకునే రామ్‌గోపాల్ వర్మ తాను స్వయంగా శ్రీదేవికి ఎంతటి అభిమానినో చెప్తూనే ఉంటాడు. దాదాపు మూడు తరాల అభిమానులని తన వైపుకు తిప్పుకున్న శ్రీదేవి. ఇప్పటికీ వార్తల్లో, సినిమాల్లో తరచూ ఉంటూనే ఉంది. ఆమె మీద వచ్చే ఏ వార్త ఆయినా ఇంట్రస్ట్ గానే చూస్తూంటారు.
ముక్కున వేలేసుకున్నారు
కొన్నళ్ళ కిందట షార్ట్స్, టీ షర్ట్ లో గ్లామర్ ఏమాత్రం తగ్గని ఫొటోలు చూసి ఔరా..! అనుకున్నారంతా.. ఈ వయసులో శ్రీదేవి అందాలు చెక్కు చెదరలేదని పలువురు అభిమానులు పొగిడేస్తుంటే...మరికొందరేమో ఈ శ్రీదేవి ఈ వయసులో ఇంత హాట్ హాట్ ఫోటోలు పోస్టు చేయడం ఏమిటని ముక్కున వేలేసుకున్నారు.
50 ఏళ్ల వయసులో
50 ఏళ్ల వయసులోనూ శ్రీదేవి అతిలోక సుందరిలా నవనవలాడుతోందంటూ మీడియా కోడై కూసింది. ఈ పరిణామాలతో శ్రీదేవి ఒక్కసారిగా షాకైంది. ఆ ఫోటోలు ఎలా ట్విట్టరోకి వచ్చాయో అర్థం కావడం లేదని....బహుషా ఇది మా పిల్లల పనే అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేసింది. తనకు తెలియకుండానే ఈ ఫోటోలు ట్విట్టర్లోకి వచ్చాయని వివరణ ఇచ్చుకుంది.
భర్త బోనీకపూర్
అయితే ఈ సారి మాత్రం తానే ఒక సూపర్ ఫొటోని పొస్ట్ చేసింది. భర్త బోనీకపూర్ ఉన్న ఓ మధురమైన చిత్రాన్ని అలనాటి అందాల తార శ్రీదేవి అభిమానులతో పంచుకోగా, అదిప్పుడు వారి హృదయాలను కొల్లగొడుతూ వైరల్ అయింది. ఈ ఇద్దరి లవ్,రొమాన్స్ ఫొటోలకి ఎక్కటం ఇదే మొదటి సారేం కాదు కానీ ఈ ముద్దు మరీ స్పెషల్ రేటింగ్ తో వైరల్ అయిపోయింది మరి. ఎందుకూ? అంటే మీరే చూడండి ఆ ఫొటోలో ఏముందో.
ఆమె బుగ్గలపై ముద్దు
సవ్యసాచి చీరను కట్టుకుని, పెద్ద పెద్ద జుమ్కీలు పెట్టుకుని శ్రీదేవి కూర్చుని ఉండగా, వెనుక నిలబడిన బోనీకపూర్ ఆమె బుగ్గలపై ముద్దు పెడుతున్నాడు. ఈ సమయంలో క్లిక్ మనిపించిన ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేస్తూ, "ఈ దీపావళికి మై నంబర్ వన్" అని క్యాప్షన్ ను ఉంచింది. శ్రీదేవి షేర్ చేసిన ఫోటోను మీరూ చూడవచ్చు.