twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీదేవికి భర్త టెన్షన్ ఓవైపు, అర్జున్ కపూర్ టెన్షన్ మరోవైపు..బాబాయ్ చెప్పిన షాకింగ్ నిజాలు!

    |

    Recommended Video

    Sridevi News : అర్జున్ కపూర్ ఇబ్బంది పెట్టేవాడని చెప్పిన శ్రీదేవి

    శ్రీదేవి అకాలమృతితో ఆమె అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంటే, సోమవారం సాయంత్రం నుంచి దుబాయ్ లో జరుగుతున్న పరిణామాలు అందరిని విస్మయానికి గురిచేస్తున్నాయి. అతిలోక సుందరిగా యావత్ సినీ భారతాన్ని తన పాదాక్రాంతం చేసుకున్న నటి శ్రీదేవి. తాజగా పరిణామాలని సినీప్రేమికులు, శ్రీదేవి అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. శ్రీదేవి ప్రస్థానం ప్రశాంతంగా ముగియదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. శ్రీదేవి మృతిలో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుపతిలో ఉన్న శ్రీదేవి బంధువు వేణు గోపాల్(శ్రీదేవికి బాబాయ్ ) ఓ ఇంటర్వ్యూ లో పలు విషయాలు వెల్లడించారు. శ్రీదేవి అనుభవాలని అయన పంచుకున్నారు.

    అందరి ఇళ్ళు ఒకేదగ్గర

    అందరి ఇళ్ళు ఒకేదగ్గర

    తిరుపతిలో శ్రీదేవి తల్లి రాజేశ్వరమ్మ తో పాటుబంధువులందరి ఇళ్ళు ఒకేదగ్గర ఉండేవి. శ్రీదేవి తల్లి రాజేశ్వరమ్మ మా అమ్మకు అన్న కూతురు. నాకు వదిన అవుతారు. శ్రీదేవికి నేను బాబాయ్ వరస అని వేణుగోపాల్ అన్నారు.

    శ్రీదేవి పేరు ఎలా మారింది

    శ్రీదేవి పేరు ఎలా మారింది

    శ్రీదేవి తండ్రి తమిళుడు. అందుకని వారు శ్రీ అమ్మయంగార్ అయ్యప్పన్ అని పెట్టారు. కానీ మేమంతా పప్పి అని పిలిచేవాళ్ళం. సినిమాల్లోకి వెళ్ళాక వాళ్ళ అమ్మా, నాన్నే శ్రీదేవి అని మార్చారు.

    స్టార్ అయ్యాక కూడా మమ్మల్ని మర్చిపోలేదు

    స్టార్ అయ్యాక కూడా మమ్మల్ని మర్చిపోలేదు

    శ్రీదేవి బంధువులం కనుక ఆమె గురించి బయట వారికన్నా మాకే ఎక్కువ తెలుసు అని వేణుగోపాల్ అన్నారు. శ్రీదేవి స్టార్ అయ్యాక రాకపోకలు తగ్గాయి.. కానీ శ్రీదేవి మమ్మల్ని మాత్రం మర్చిపోలేదు. నా కొడుకు ఉమేష్ ని బాగా చూసుకునేది. మేము ఇల్లు కట్టుకుంటుంటే కూడా సాయం చేసింది. ఆమెని కలుసుకోవడానికి ఎప్పుడు వెళ్లినా ఖచ్చితంగా సాయం చేస్తుంది.

    బోనీ కపూర్ తో పెళ్లి అయ్యాక

    బోనీ కపూర్ తో పెళ్లి అయ్యాక

    బోనికపూర్ తో వివాహం జరిగాక శ్రీదేవి ముంబై వెళ్ళిపోయింది. అప్పటి నుంచి రాకపోకలు బాగా తగ్గాయి. కానీ ప్రతి ఏడాది శ్రీదేవి ఆగస్టు 13 న తన పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు వస్తుంది. అప్పుడు అందరిని కలిసేది అని వేణుగోపాల్ అన్నారు.

    బోనికపూర్ మర్యాదస్తుడు

    బోనికపూర్ మర్యాదస్తుడు

    బోనికపూర్ కూడా తమతో బాగా ఉండేవారని ఆయన అన్నారు. భాష సమస్య వలన సరిగా మాట్లాడలేకపోవచ్చు. కానీ తమకు బాగా మర్యాద ఇచ్చేవారు అని అన్నారు.

    ఆ విషయం ఊహించలేదు

    ఆ విషయం ఊహించలేదు

    శ్రీదేవి నాలుగేళ్ళ వయసులోనే నటించడానికి మద్రాసు వెళ్ళిపోయింది. ఇంతపెద్ద స్టార్ అవుతానందని ఊహించలేదు అని వేణుగోపాల్ అన్నారు. అయినా బిడ్డ ఇంత పెద్ద స్టార్ అయిందంటే మాకు చాలా సంతోషం. శ్రీదేవి బంధువులం అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం అని అయన అన్నారు.

    శ్రీదేవి సర్జరీల గురించి

    శ్రీదేవి సర్జరీల గురించి

    శ్రీదేవి ముక్కుకు ఆపరేషన్ చెసించుకుందని విన్నాం. సర్జరీలు ప్రమాదం అని కూడా విన్నాం. రాజేశ్వరమ్మ ఉన్నప్పుడు కష్టసుఖాలు మాట్లాడుకునే వాళ్ళం. ఆవిడ పోయాక సలహాలు ఇచ్చే అవకాశం మాకు లేకుండా పోయింది.

    శ్రీదేవి మరణం.. అనుమానాలు

    శ్రీదేవి మరణం.. అనుమానాలు

    శ్రీదేవి మృతి విషయంలో టీవీలో ఏవేవో చూపిస్తున్నారు. అక్కడ ఏం జరిగిందో మాకు కూడా తెలియదు.

    అర్జున్ కపూర్ గురించి బాధ

    అర్జున్ కపూర్ గురించి బాధ

    శ్రీదేవి ఇబ్బందులో ఉన్నట్లు, మనసులో బాధ పడుతున్నట్లు మాతో చెప్పలేదు. బోనికపూర్ గారి మొదటి భార్య కుమారుడు అర్జున్ కపూర్ ఇబ్బంది పెట్టేవాడిని బంధువులతో శ్రీదేవి చెప్పుకుని భాదపడిందని విన్నాం అని వేణుగోపాల్ అన్నారు.

    శ్రీదేవి మనసులో దిగులు

    శ్రీదేవి మనసులో దిగులు

    తన భర్త ఆరోగ్యం గురించి శ్రీదేవి ఎప్పుడూ దిగులు పడదని, బోనికపూర్ ఓ సారి షుగర్ బాగా ఎక్కువవడంతో తాను, పిల్లలు ఏమైపోతామో అని దిగులు చెందినట్లు మా బంధువులు చెబితే విన్నాం అని ఆయన అన్నారు.

    శ్రీదేవి చెల్లెలు శ్రీలతతో విభేదాలు

    శ్రీదేవి చెల్లెలు శ్రీలతతో విభేదాలు

    శ్రీదేవి తల్లి రాజేశ్వరమ్మ ఆసుపత్రిలో మరణించిన సందర్భంలో ఇద్దరి మధ్య బిల్లు విషయంలో మస్పర్థలు ఏర్పడ్డాయి. ఆ తరువాత ఆ గొడవ సద్దుమణిగిపోయింది.

    దేశం కానీ దేశంలో ఇలా

    దేశం కానీ దేశంలో ఇలా

    శ్రీదేవి మా కుటుంబానికి గర్వకారణం. కూతురి సినిమాని కళ్లారా చూసుకోకుండానే మరణించింది. కానీ ఇలా దేశం కానీ దేశంలో మరణించడం, అది వివాదంగా మారుతుండడం భరించలేకపోతునం అని వేణుగోపాల్ అన్నారు.

    English summary
    Sridevi's uncle reveals interesting facts about Sridevi. He made shocking comments on Arjun Kapoor
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X