చిరంజీవితో నటించనంటున్న టాప్ హీరోయిన్...!?
ఇటీవల పతీసమేతంగా తిరుమల వచ్చిన ఒకప్పటి సౌందర్యరాశి శ్రీదేవిని చూసిన వాళ్లంతా విస్తుబోయారు. 'నిన్నటి అందమంతా ఏమైంది తల్లీ?' అంటూ అంతా ముక్కున వేలేసుకున్నారు. ఇంత పీలగా అందవిహీనంగా హఠాత్తుగా ఆమె మారిపోవడానికి కారణం ఏమిటబ్బా? అని అంతా తమలో తామే ప్రశ్నించుకున్నారు. ఆమె అందంలో వచ్చిన ఈ విపరీత పరిణామం గురించి తెలుగు మీడియా కూడా స్టోరీలు అల్లింది. ఇదే విషయం మీద ఇప్పుడు ముంబై మీడియా కూడా రాస్తోంది. అనారోగ్యానికి గురికావడం వల్లే ఆమె అలా పీలగా తయారైందని అంటున్నారు. శ్రీదేవి హైపర్ థైరాయిడిజం అనే డిజార్డార్ తో బాధపడుతోందని కొన్ని పత్రికలు రాస్తున్నాయి.
కాగా ఆ మధ్య చిరంజీవి 150వ సినిమా ప్రారంభం కాబోతోందని, ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరన్నది సస్పెన్స్ లో వుంచారని వార్తలు వచ్చాయి. రామ్ చరణ్ ఆ సినిమా నిర్మించబోతున్నాడని కూడా అన్నారు. ఆ తర్వాత సినిమాల్లో చిరంజీవి సినిమా మరుగున పడిపోయింది. తాను సినిమాల్లో నటిస్తానని చిరంజీవే స్వయంగా ప్రకటించడంతో ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి మళ్ళీ పలు ఊహాగానాలు మొదలయ్యాయి.
లేటెస్ట్ గా చిరంజీవికి జోడీగా శ్రీదేవి నటించబోతోందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఇటీవల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు శ్రీదేవి, బోనీకపూర్ తిరుపతి వచ్చిన సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ తాను సినిమాల్లో మళ్లీ నటించే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పేసింది అలాగే చిరంజీవి సినిమాలో నటించబోతున్నానని వస్తున్న వార్తల్లో కూడా ఎంతమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది..


Click it and Unblock the Notifications











