Don't Miss!
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శ్రీదేవిలో ఈ టాలెంట్ కూడా ఉందా: ముక్కున వేలేసుకున్న బాలీవుడ్
Recommended Video
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ స్క్రీన్ వరకు శ్రీదేవి కెరీర్ ఎంతో సక్సెస్ ఫుల్ గా సాగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి జనరేషన్ తెరపై కనిపించిన శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి పదహారేళ్లకే హీరోయిన్ అయ్యింది. కెరీర్ లో ఎన్నో విజయాలను అందుకున్న శ్రీదేవి లైఫ్ ని సక్సెస్ లోనే రన్ చేసుకుంటూ వచ్చింది.
పెయింటింగ్ అంటే చాలా ఇష్టం
నటనలో డ్యాన్సులో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె దగ్గర మరో టాలెంట్ కూడా ఉంది. శ్రీదేవికి చిన్నప్పడు చాలా ఇష్టం ఉన్నా సినిమా కెరీర్ వలన ఆ టాలెంట్ ను అలానే దాచి పెట్టి రీసెంట్ గా మళ్లీ ఆచరణలోకి తెచ్చిందట. శ్రీదేవికి పెయింటింగ్ అంటే చాలా ఇష్టమట.
సోనమ్ కపూర్
ఆమె ఎవ్వరికి తెలియకుండా అయిదేళ్ల నుంచి పెయింటిగ్ వేస్తూ.. కొంత మందికి బహుమతిగా కూడా ఇస్తుందట. రీసెంట్ గా తన మరిది కూతురు సోనమ్ కపూర్ కి శ్రీదేవి ఒక అందమైన పెయింటింగ్ వేసి ఇవ్వడంతో సోనమ్ తన రూమ్ లో ఇష్టమైన ప్రదేశంలో ఉంచిందట. ఆ పెయింటింగ్ ను సోనమ్ చాలా ఇష్టపడిందట.
ల్యాండ్‌మార్క్ డ్యాన్సింగ్ స్టిల్
అయితే ఇలా ఇచ్చిన ఆర్ట్‌లో ఎన్నో విన్యాసాలు. మైఖేల్ జాక్సన్ ల్యాండ్‌మార్క్ డ్యాన్సింగ్ స్టిల్.. మగువల మేని సొగసుల విన్యాసాలు.. ఇలా రకరకాల పెయింటింగులు ఉన్నాయిట. ఊహించని సర్ప్రైజ్ ఏమంటే.. శ్రీదేవి తన గారాల పట్టీలు జాన్వి, ఖుషీలను బొమ్మలుగా గీసిందిట.
అంతర్జాతీయ ఎగ్జిబిషన్
ఇన్నాళ్లు శ్రీదేవి లోని ఆర్టిస్టు గురించి లోకానికి తెలిసిందే లేదు. అలా ఎందుకు జరిగింది అంటే తనెప్పుడూ పెయింటింగ్ ఎగ్జిబిషన్ షో లాంటివాటిని ఏర్పాటు చేయలేదు. ఇదంతా తెలుసుకున్న ఓ అంతర్జాతీయ ఎగ్జిబిషన్ సంస్థ శ్రీదేవిని సంప్రదించి ఆ పెయింటింగులతో ఓ షో ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేసిందిట.
మంచి కాజ్ కోసం
అయితే ఇది ఓ చారిటీకి నిధి సేకరించేందుకేనని తెలుస్తోంది. ఓ మంచి కాజ్ కోసం ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం హర్షించదగినదే. ఒకవేళ ఎగ్జిబిషన్లో జాన్వి, ఖుషీల పెయింటింగులు లభిస్తే కుర్రకారు కొనేందుకు పోటీపడడం ఖాయం.