కూతురుకు సిస్టర్‌గా కనిపించబోతున్న శ్రీదేవి!
ముంబై : ఒకప్పుడు పాపులర్ హీరోయిన్‌గా వెలుగొందిన శ్రీదేవి ఈ మధ్యే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. 'ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రం ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి ఈ మధ్య పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇప్పటికీ తన గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని పొగడ్తలు అందుకుంటోంది.
'ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రం తర్వాత శ్రీదేవి మరేచిత్రంలోనూ కనిపించలేదు. తన పాత్రే ప్రధానంగా ఉండే సినిమాలు తప్ప......ఇతర సినిమాలు ఏవీ చేయనని భీష్మించుకుని కూర్చుంది శ్రీదేవి. ఆ విషయం పక్కన పెడితే శ్రీదేవితో పాటు శ్రీదేవి కూతురు కూడా ఈ మధ్య వార్తల్లో వ్యక్తిగా మారింది.

ఈ మధ్య ఏ కార్యక్రమంలో చూసినా శ్రీదేవి కూతురు జాన్వి సెక్సీ లుక్‌తో, చిట్టిపొట్టి డ్రెస్సులతో మీడియాను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. దీంతో జాన్వి త్వరలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోందనే వార్తలు మొదలయ్యాయి. త్వరలో ఈ వార్తలుే నిజం కానున్నాయి.
కాగా...ఈ మధ్య వీరిద్దరూ కలిసి ఏదైనా కార్యక్రమానికి హాజరైతే శ్రీదేవి జాన్వికి తల్లిలా లేదని, సిస్టర్‌లా ఉందని అంతా పొగిడేస్తున్నారట. దీంతో జాన్వి తెరంగ్రేటం చేయబోయే సినిమాలో వీలైతే ఆమెకు అక్క పాత్రలో కనిపిస్తానని సన్నిహితులతో అంటోందట శ్రీదేవి. పైగా తను కూడా నటిస్తే సినిమాకు పబ్లిసిటీ కూడా బాగా పెరుగుతుందనే ఉద్దేశ్యంతో శ్రీదేవి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











