శ్రీదేవి ముద్దు పెట్టడంతో అంతా షాకయ్యారు!
శ్రీదేవి ముద్దు పెట్టుకున్న అమ్మాయి ఎవరో కాదు...ఆమె సవతి కూతురు. పేరు అన్షులా కపూర్. శ్రీదేవి భర్త బోనీ కపూర్ మొదటి భార్య మోనా కపూర్ కూతురే ఈ అన్షులా కపూర్. ఇటీవల ఓ ప్రైవేట్ ఈవెంటులో వీరిద్దరు తారస పడ్డారు. దీంతో అన్షులా కపూర్‌కు మర్యాద పూర్వకంగా ముద్దాడింది శ్రీదేవి. ఆ సయమంలో శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి కూడా ఆమె వెంటే ఉన్నారు.
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే....శ్రీదేవి, అన్షులా కపూర్ ఇలా పార్టీలో కలిసి కనిపించడం ఇదే తొలిసారట. అందుకే చూసిన వారంతా ఆశ్యర్యపడ్డారు. బోనీకపూర్‌ను పెళ్లాడిన తర్వాత నుండి శ్రీదేవి....సవతి మెనా కపూర్, ఆమె పిల్లలకు అంటీ ముట్టనట్లే వ్యవహరిస్తూ వస్తోంది.
శ్రీదేవికి సినిమా జీవితం విశేషాల్లోకి వెళితే....
త్వరలో ఆమె ప్రముఖ హాలీవుడ్ నటి మార్లీ స్ట్రీప్స్‌తో కలిసి హాలీవుడ్ చిత్రంలో నటించబోతోంది. 'కౌబాయ్స్ అండ్ ఇండియన్స్' అనే టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హాలీవుడ్ బడా నిర్మాతలు జెరెమీ వా్, జెర్రీ లైడర్ ఈ ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్‌ను మరోసారి ప్రపంచ తెరపై చూపించబోతున్నారు. 'కౌబాయ్ అండ్ ఇండియన్స్' చిత్రానికి హాలీవుడ్ దర్శకురాలు అమీ రెడ్‌ఫోర్డ్ దర్శకత్వం వహించనున్నారు. అమీ ఎవరో కాదు....హాలీవుడ్ లెజెండ్ రాబర్ట్ రెడ్‌ఫోర్డ్ కుమార్తె.
స్టార్ రైటర్‌గా పేరు తెచ్చుకున్న కోన వెంకట్ త్వరలో అతిలోక సుందరి శ్రీదేవితో సినిమా చేయబోతున్నారు. శ్రీదేవి కోసం కోన ఒక అద్భుతమైన కథను రెడీ చేసాడట. ఈ విషయాన్ని కోన వెంకట్ స్వయంగా తన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా వెల్లడించడం గమనార్హం.


Click it and Unblock the Notifications












