పవన్ కళ్యాణ్ కోసం పవర్ఫుల్ కథ సెట్ చేశా.. ఆయన ఒప్పుకుంటే సిద్ధమే: టాలెంటెడ్ డైరెక్టర్
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎప్పుడూ కూడా కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడంలో ముందుంటారు అనే విషయం తెల్సిందే. దర్శకుడికి మంచి టాలెంట్ ఉంటె చాలు ఆకట్టుకునే కథ దొరికితే సినిమా చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధం అని ఇప్పటికే పలు ఇంటర్వ్యూ ల్లో సైతం వెల్లడించారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్వరలో మరొక దర్శకుడితో సినిమా చేయనున్నట్లు టాక్ వస్తోంది. ప్రస్తుతం తన అభిమాని సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ తోపాటు ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలు చేస్తున్నారు పవర్ స్టార్.

సంక్రాంతికి పక్కా..
వీటిలో ప్రస్తుతం భీమ్లా నాయక్ షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతోంది. మలయాళంలో తెరకెక్కి మంచి హిట్ కొట్టిన అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ కి త్రివిక్రమ్ డైలాగ్స్ అందిస్తున్నారు. కాగా ఈ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది. దీనితో పాటు ఇప్పటికే సగం షూట్ పూర్తి చేసుకున్న హరిహర వీరమల్లు కూడా నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో ప్రారంభించనున్నట్లు టాక్.

పవన్ కళ్యాణ్ తో సినిమా
అయితే అసలు విషయంలోకి వెళితే, ఇటీవల కొత్త నటులతో పలాస 1978 అనే యాక్షన్ డ్రామా మూవీ తీసి సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు కరుణ కుమార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. లేటెస్ట్ గా సుధీర్ బాబు శ్రీదేవి షోడా సెంటర్ అనే మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాకు కూడా ఓ వర్గం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను అందుకుంటోంది. మొత్తానికి దర్శకుడు మరొక సక్సెస్ ని అయితే తన ఖాతాలో వేసుకున్నారు. మంచి యాక్షన్, లవ్ స్టోరీ మూవీ గా రూపొందిన ఈ సినిమా 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కింది.

ఆ కథ పవన్ కు సరిపోతుంది
ఇక కొద్దిరోజుల క్రితం పవర్ స్టార్ కోసం తాను ఒక అద్భుతమైన స్టోరీ సిద్ధం చేసానని చెప్పిన కరుణ కుమార్, అన్ని రకాల హంగుల మేళవింపుగా రాసుకున్న ఆ స్టోరీ పవన్ కు సరిగ్గా సరిపోతుందని అన్నారు. త్వరలో ఆయన ఛాన్స్ ఇస్తే తప్పకుండా సినిమా తెరకెక్కిస్తాను అంటూ ప్రస్తుతం ఒక మీడియా ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించారు.

పవన్ ఛాన్స్ ఇస్తాడా?
అయితే కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో అతడికి ఛాన్స్ ఇస్తే తప్పకుండా వీరిద్దరి కాంబోలో మంచి సక్సెస్ ఫుల్ మూవీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. మరి పవర్ స్టార్, కరుణ కుమార్ కు అవకాశం ఇస్తారో లేదో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదు. ఇక ప్రస్తుతం పవర్ స్టార్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా వచ్చే సంక్రాంతికి భారీ స్థాయిలో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా అనంతరం పవర్ స్టార్ హరీష్ శంకర్ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హరహర వీరమళ్లు సినిమాను కూడా వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











