విజయ్ మూవీలో శ్రీదేవి: 15 ఎకరాల్లో భారీ సెట్
హైదరాబాద్: ‘కత్తి'తో రికార్డులు సృష్టిస్తున్న ఇళయదళపతి విజయ్ నటిస్తున్న కొత్త సినిమా కోసం చెన్నై బీచ్ రోడ్డులో ఓ భారీ సెట్ నిర్మించారు. శంకర్ ‘ఐ' చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన ముత్తురాజ్ 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ భారీ సెట్ నిర్మించారు. 750 మంది దాదాపు 6 నెలల పాటు రాత్రింభవళ్లు కష్టపడి ఈ సెట్ నిర్మించారు.
నవంబర్ 10 నుండి 60 రోజుల పాటు జరిగే షెడ్యూల్ లో విజయ్ తో పాటు శృతి హాసన్, హన్సిక పాల్గొంటారు. ప్రముఖ సీనియర్ హీరోయిన్ శ్రీదేవి, కన్నడ స్టార్ సుదీప్ ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి శింబుదేవన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం కోసం రూపొందించిన సెట్ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ చిత్రంలో శ్రీదేవి హన్సిక తల్లి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

విజయ్ నటించిన ‘కత్తి' సినిమా విషయానికొస్తే...విజయ్, సమంత హీరో హీరోయిన్లుగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం కత్తి దక్షిణాదిన సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా విడుదలైన 12 రోజుల్లో 100 కోట్ల రూపాయల మైలురాయిని చేరుకుంది. అతితక్కువ కాలంలో ఈ ఖ్యాతిని సొంతం చేసుకున్న తొలి దక్షిణాది చిత్రం ఇదే కావడం విశేషం. విడుదలైన తొలిరోజు నుంచి ఇప్పటివరకూ ఈ చిత్రం ఇండియాలో 80.5 కోట్లు, ఓవర్సీస్‌లో 20.2 కోట్ల వసూళ్లను సాధించినట్లు దర్శకుడు మురుగదాస్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఈ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేద్దామని అనుకున్నప్పటికీ ఆయన సినిమా చూసి నో చెప్పడంతో ఇక డబ్బంగ్ వెర్షన్ తెలుగులో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో నవంబర్ 21న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళనాట ఓపెనింగు రోజు రూ. 15 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నారు. ఇంతకు ముందు విజయ్ నటించిన తుపాకి చిత్రం తెలుగులో కూడా మంచి ఫలితాలు రాబట్టిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











