అతిలోక సుందరి శ్రీదేవి 49
బాలనటిగా సినీ కెరీర్ ప్రారంభించిన శ్రీదేవి 'పదేహారేళ్ల వయసు" చిత్రం ద్వారా హీరోయిన్ పరిచయం అయింది. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో ఆమెకు మళ్లీ వెను దిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అలనాటి స్టార్ హీరోయిలు ఎన్టీరామారావు, అక్కినేని నాగేశ్వరావులాంటి వారితో.... ఆ తర్వాతి తరం నటులైన చిరంజీవి, వెంకటేష్, నాగార్జున స్టార్స్ తోనూ జత కట్టిన వైనం ఆమె వన్నె తరుగని అందానికి నిదర్శనం.
హిందీ చిత్ర సీమలో ఓ వెలుగు వెలిగిన తర్వాత నిర్మాత బోణీ కపూర్ ను పెళ్లి చేసుకుని సినిమాల్లో నటించడం మానేసిన శ్రీదేవి తన ఇద్దరు కూతర్లు భావి హీరోయిన్లుగా తీర్చి దిద్దే పనిలో పడింది. మా కలల రాణి మరోసారి తెరపై కనిపించి కనువిందు చేయాలని అభిమానులు కోరుతుండటంతో త్వరలో 'ఇంగ్లీష్ వింగ్లిష్' చిత్రం ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి తెరగ్రేటం చేసేందుకు సమాయత్తం అవుతోంది. ఇప్పటికే ఫ్యాషన్ షోలలో తళుక్కుమంటూ తన తెరంగ్రేటానికి మార్గం సుగమం చేసుకుంటోంది. మరి ఈ ఎవర్ అందగత్తె సెకండ్ ఇన్నింగ్స్ విజయవంతంగా సాగాలని కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ చెబుదాం.


Click it and Unblock the Notifications












