»   » అర్ధ శతాబ్దపు సౌందర్యం శ్రీదేవి (ఫోటో ఫీచర్)

అర్ధ శతాబ్దపు సౌందర్యం శ్రీదేవి (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'జగదేక వీరుడు అతిలోక సుందరి" సినిమాలో దేవలోకంలోంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా కనిపించే శ్రీదేవి అంటే ఇష్టపడని వారంటు ఉండరు. శ్రీదేవి అంటే అందం, అభినయం, హుందాతనం, దర్పం, ప్రేమ, త్యాగం, లాలిత్యం - ఇలా ఎన్నో. మేకప్‌ లేకపోయినా అతిలోక సుందరిలా మెరిసిపోతూనే ఉంటుంది.

మేకప్ తోనే అందం రాలేదు. అందమే మేకప్ అయ్యింది శ్రీదేవికి. 'ఫలానా పాత్రలకు మాత్రమే' అనేది శ్రీదేవి విషయంలో అబద్దం. అన్ని పాత్రలూ తనవే. అన్నిటా తనే. తన అందచందాలతో, హావభావాలతో అన్ని తరాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న జాతీయనటి శ్రీదేవి తెలుగు తార కావడం మనందరికి గర్వకారణం.

ప్రముఖనిర్మాత బోనీకపూర్‌ తో వివాహం అనంతరం శ్రీదేవి చాలా కాలం సినిమాలకు దూరంగా ఉంది. అయితే మొన్నామధ్య 'ఇంగ్లిష్‌ వింగ్లిష్‌'తో మళ్లీ తానేంటో ప్రూవ్ చేసుకుంది. ఇక శ్రీదేవికి జాహ్నవి, కుషి అని ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయినా ఇప్పటికి చెక్కుచెదరని అందంతో కనిపించే శ్రీదేవి పుట్టిన రోజు నేడు ఈ సందర్భంగా 'దట్స్ తెలుగు" తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నది.

శ్రీదేవి విశేషాలుతో కూడిన స్లైడ్ షో...

ఐదేళ్లకే తెరపై...

ఐదేళ్లకే తెరపై...

తెలుగు ప్రేక్షకులకు కుందనాల బొమ్మగా కనిపించినా...బాలీవుడ్‌ వారికి డ్రీమ్‌ గర్ల్‌ శ్రీదేవి 13 ఆగస్టు 1963లో మద్రాసులో జన్మించింది.తన ఐదేళ్ల ప్రాయంలోనే చిత్రరంగ ప్రవేశం చేసి బాలనటిగా ఔరా అనిపించుకుంది. అప్పటి నుంచీ నుంచీ ఆమె ప్రస్దానం కొనసాగుతూనే ఉంది. 'ఈ గడుగ్గాయ్‌.. ఏదో ఒక రోజు చిత్రసీమను ఏలేస్తుంది చూడండి' - తమిళ చిత్రం 'తునైవన్‌'లో చిన్నారి శ్రీదేవిని చూసి మెటికలు విరుచుకొన్నారంతా. ఈ మాట కోసమే ఎదురుచూస్తున్నట్టు దేవతలు 'తథాస్తు' అనేశారు. శ్రీదేవి విజయ పరంపర ఆ సినిమాతో ప్రారంభమైంది. ఇప్పటికీ ఆమె క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదంటే అతిశయోక్తి కాదు.

మనవరాలుగా...జంటగా..

మనవరాలుగా...జంటగా..

'బడిపంతులు" చిత్రంలో యన్‌టిఆర్‌కి మనవరాలుగా నటించిన శ్రీదేవి అనంతరం హీరోయిన్‌ అయ్యాక ఆయనకు జోడీగా ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించి మంచిపేరు సంపాదించుకుంది. 'పదహారేళ్ల వయసు"లో హీరోయిన్‌గా చేసి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది. తర్వాత ఎన్టీఆర్ సరసన ఆమె ఎన్నో హిట్ సినిమల్లో నటించింది. ఆమె ప్రక్కన చేయటం ఆ తరంలో హిట్ గ్యారెంటీ అనే కాన్సెప్ట్ అనేవారు.

గొప్ప దర్శకులతో...

గొప్ప దర్శకులతో...

బాలచందర్‌, భాగ్యరాజా, రాఘవేంద్రరావు - వీరి మార్గ'దర్శకత్వం'లో నడిచే అవకాశం తొలినాళ్లలోనే శ్రీదేవికి దక్కింది. ఆమె ఎదుగుదలకు వాళ్లు చెప్పిన పాఠాలూ ఓ కారణమయ్యాయి. అందుకే అటు అందం, ఇటు నటన రెండింటిలోనూ రాణించగలిగాను అంటుంది. దర్శకుడు చెప్పినట్లు చేయటమే తన విజయ రహస్యం అంటుంది.

ఏ ఎమోషన్ అయినా...

ఏ ఎమోషన్ అయినా...

''సిరిమల్లె పువ్వా.. సిరిమల్లె వువ్వా'' అంటూ పదహారణాల తెలుగమ్మాయి ఉయ్యాల వూగుతూ పాడుకొన్న పాటల్లో, ''ఆకు చాటు పిందె తడిసె''లాంటి రొమాంటిక్‌ గీతాలలోనూ, ''అబ్బనీ తీయనీ దెబ్బ'' లాంటి అల్లరి పాటల్లోనూ తనదైన ఓ మెరుపు జోడించింది శ్రీదేవి. అంతేకాదు..ఆమె కథలోని ఏ ఎమోషన్ ని అయినా చక్కగా పండించగలగుతుంది. తేలిగ్గా పాత్రలతో ఇమిడిపోగల నేర్పరి ఆమె అంటారు ఆమెతో పనిచేసిన దర్శకులు.

తరాలు మారినా..

తరాలు మారినా..

జయప్రద, జయసుధ, విజయశాంతి ఇలా తరానికో హీరోయిన్ ఆధిపత్యం చెలాయించినా శ్రీదేవి స్థానం చెక్కుచెదరలేదు. వారితో పోటీగా నిలిచింది. గెలిచింది. మరో హీరోయిన్ తో హీరోని పంచుకోవలసిన కథల్లోనూ శ్రీదేవిది పైచేయే. ఉత్తరాది, దక్షిణాది చిత్రసీమల్ని కలిపిన తారగా మన్ననలు అందుకొంది.

 స్పెషాలిటీ..

స్పెషాలిటీ..

ఎత్తుపల్లాలు, డక్కాముక్కీలు, ఆటుపోట్లూ లేకుండా ఎవరూ నెంబర్‌ వన్‌ కాలేరు. అలా అయ్యిందంటే ఆమె శ్రీదేవి మాత్రమే. ఆమె కెరీర్‌ గ్రాఫ్‌లో ఎప్పుడూ హెచ్చుతగ్గులు లేవు. 'నాకొద్దు' అనేంత వరకూ ఆమె జోష్‌ కొనసాగుతూనే ఉంది. ఇంతకంటే సంతృప్తికరమైన సినీ జీవితం మరేం ఉంటుంది? ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, శోభన్‌బాబుల ముందు బాలనటిగా తిరిగింది. కట్‌ చేస్తే వాళ్లతో డ్యూయెట్లు పాడింది. ఇంత కంటే గొప్ప గ్రాఫ్‌ ఎవరికి దక్కుతుంది? అంటారు.

వసంత కోకిల..

వసంత కోకిల..

కమల్‌హాసన్‌ సినిమా అంటే నటించడానికి మరొకరికి అవకాశం దక్కదు. ఆ సినిమా చూసొచ్చాక కేవలం కమల్‌ గురించే మాట్లాడుకోవాలి. కానీ 'వసంత కోకిల'ని మాత్రం మినహాయించుకోవాలి. శ్రీదేవికి సరైన పాత్ర పడితే, ఆమె నటన ఏ స్థాయిలో ఉంటుందో చెప్పిన చిత్రమిది. ఇప్పటికీ కొంతమంది హీరోయిన్స్ ..''వసంత కోకిల'లో శ్రీదేవి చేసిన పాత్ర చేయాలని ఉంది'' అని చెప్తుంటారు. ఆ పాత్రకు దక్కిన అరుదైన గౌరవం అది.

అప్పుడు-ఇప్పుడు తేడా లేకుండా

అప్పుడు-ఇప్పుడు తేడా లేకుండా

కమర్షియల్‌ సినిమాల హవా కొనసాగుతున్నప్పుడు, కుటుంబ కథా చిత్రాలు వెల్లువగా వస్తున్నప్పుడు, ఫాంటసీ సినిమాలు మొదలైనప్పుడు ఇలా ఎలాంటి ట్రెండ్‌లో అయినా ఇమిడిపోయింది శ్రీదేవి. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, శోభన్‌బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ - ఒక్కరని కాదు, స్టార్‌ అనిపించుకొన్న ప్రతి హీరోకీ దీటుగా పోటీగా నటించింది, మెప్పించింది.

ఈ వయస్సులోనూ..

ఈ వయస్సులోనూ..

యాభై ఏళ్ల వయసులో, అమ్మ పాత్రలే దక్కాల్సిన తరుణంలో 'ఇంగ్లిష్‌ వింగ్లిష్‌'తో మరోసారి తన ప్రతిభ చాటుకొంది శ్రీదేవి. ఆమె సినిమాల కోసం ఇప్పటికీ ఎదురుచూసే ప్రేక్షకులు ఉన్నారు అని చెప్పడానికి 'ఇంగ్లిష్‌ వింగ్లిష్‌' సాధించిన విజయమే ఓ ఉదాహరణ. మంగళవారం శ్రీదేవి తన 50వ పుట్టిన రోజు జరుపుకోనుంది. ఈ అర్ధ శతాబ్దపు సౌందర్యం - వెండి తెరపై మున్ముందూ ఇలాగే వెలుగులు విరజిమ్మాలని కోరుకొందాం.

సెక్సీ భంగిమలతో..

సెక్సీ భంగిమలతో..

ఐదు పదుల వయసుకు చేరువవుతున్నా వన్నెదగ్గని అందంతో వెలిగిపోతూ...‘అతిలోక సుందరి' అనే పేరును సార్ధకం చేసుకుంటోంది హీరోయిన్ శ్రీదేవి. తాజాగా శ్రీదేవి కుర్ర హీరోయిన్లను తలదన్నే రేంజిలో వోగ్ మేగజైన్ కోసం సెక్సీ భంగిమలతో హాట్ హాట్‌గా ఫోటో షూట్లో పాల్గొంది. ఈ ఫోటోల్లో ఆమెను చూస్తుంటే వయసులో ఉన్న రోజ్లో సెక్సీగా తన అందాచందాలతో అభిమానులను అలరించిన శ్రీదేవి గుర్తొస్తుందని, ఆమెలో గ్లామర్ పాళ్లు ఏమాత్రం తగ్గలేదని అంటున్నారు అభిమానులు. ఇలా ఫోటో షూట్లలో శ్రీదేవి జోరు చూస్తుంటే ఆమె సినిమాల్లో తన స్పీడు పెంచుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

English summary
This gorgeous actress can easily pass off as a 30-year-old. In fact it is hard for many to believe that Sridevi Boney Kapoor is already 50-years-old and celebrating her golden birthday on August 13, 2013.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu