»   » శ్రీదేవి అప్ సెట్: కూతురుపై అలాంటి వార్తలే కారణం

శ్రీదేవి అప్ సెట్: కూతురుపై అలాంటి వార్తలే కారణం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శ్రీదేవి కూతురు ఝాన్వి కపూర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోందంటూ గత కొంతకాలంగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య ఝాన్వి కపూర్ కూడా పలు కార్యక్రమాల్లో, ఫ్యాషన్ షోలలో తల్లితో పాటు హాజరవుతూ హాట్ హాట్ డ్రెస్సులో సందడి చేయడం కూడా ఇలాంటి వార్తలకు మరింత బలాన్ని ఇచ్చాయి.

అయితే తాజాగా శ్రీదేవి ఈ వార్తలపై భగ్గుమంది. తన కూతురు ఇంకా చదువుకుంటోందని, ఇలాంటి వార్తలు రాయొద్దని అంటోంది. ఝాన్వి సినిమాల్లోకి వస్తుందా? లేదా? అనేది పూర్తిగా ఆమె ఇష్టం. మీడియా వారు అనవసరంగా ఇలాంటి వార్తలు క్రియేట్ చేసి కన్ ఫ్యూజ్ చేయొద్దు అని శ్రీదేవి చెప్పుకొచ్చారు.

 Sridevi Upset Over Daughter's Debut Rumours

మరి మీ కూతురు ఈ మధ్య మీ వెంట తిరుగుతూ తెగ హడావుడి చేస్తోంది కదా... దానికి వెనక గల కారణం ఏమిటి? సినిమాల్లోకి తీసుకొద్దామనే ఉద్దేశ్యం లేదా? అంటూ మీడియా వారు ప్రశ్నించగా...కాస్త గట్టిగా సమాధానం చెప్పింది శ్రీదేవి. 'నేను 15 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. నా కుతురు ఎప్పుడూ నాతో ఉండటానికి ఇష్ట పడుతుంది. అంత మాత్రాన ఆమెను నేనే కావాలని ప్రమోట్ చేస్తున్నట్లు మీరు భావిస్తే ఎలా? అంటూ ఘాటు సమాధానం ఇచ్చారు శ్రీదేవి.

అయితే......శ్రీదేవి ఇలా మాట్లాడటం వెనక మరో కారణం ఉందని ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్. ఝాన్వి సినీ ఎంట్రీకి సరైన కథలు దొకరడం లేదని, అదే సమయంలో ఆమె తెరగ్రేటంపై అంచనాలు భారీగా పెరిగితోన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు విషయాలను బ్యాలెన్స్ చేయడానికే శ్రీదేవి ఇలా మాట్లాడుతోందని....ఆమె తెరంగ్రేటంపై అంచనాలు తగ్గించేందుకు శ్రీదేవి ప్రయత్నిస్తోందని అంటున్నారు.

English summary
There has been a lot of speculation about Sridevi’s little daughter making her debut in films. Much has been written and after sufficient rumours have been floated around, Sridevi has finally decided to put an end to speculation by announcing that Jhanvi is still studying.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu