హన్సికతో ఇబ్బంది పడ్డ శ్రీదేవి, అర్థం చేసుకుని కూల్...
చెన్నై: తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం ‘పులి' అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ఈచిత్రానికి శింబుదేవన్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రుతిహాసన్, హన్సిక హీరోయిన్స్. మాజీ స్టార్ హీరోయిన్ శ్రీదేవి ఈ చిత్రంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం పోషిస్తున్నారు. పీరియడ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవిశ్రీ వైవిధ్యమైన బాణీలు అందిస్తున్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి ఇపుడు హాట్ టాపిక్ అయింది. ఇటీవల శ్రీదేవికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు హన్సికతో కలిసి షూట్ చేయాల్సి వచ్చింది. అయితే యూనిట్ సభ్యుల షెడ్యూలింగ్ సరిగా లేనందున ఆమె ఇబ్బంది పడ్డట్లు సమాచారం. కొన్ని కారణాల హన్సికతో చేయాల్సిన సీన్ కోసం శ్రీదేవి దాదాపు నాలుగు గంటల వెయిట్ చేసిందట.
శ్రీదేవి రేంజిలో ఉన్న వారు ఇంత ఆలస్యాన్ని, అసౌకర్యాన్ని అస్సలు సహించరు. అయితే శ్రీదేవి మాత్రం పరిస్థితి అర్థం చేసుకుని కోపం ప్రదర్శించకుండా కూల్‌గా ఉందట. అదే వేరొకరు అయితే పరిస్థితి మరోలా ఉండేదని, ఏదో ఒక గొడవ చేసే వారని యూనిట్ సభ్యులు అంటున్నారు. శ్రీదేవి మంచి మనసున్న వ్యక్తి అని పొగిడేస్తున్నారు.
hansika vijay sridevi sruthi hassan devisri prasad హన్సిక విజయ్ శ్రీదేవి శృతి హాసన్ దేవిశ్రీ ప్రసాద్


Click it and Unblock the Notifications