»   » జాహ్నవి జీవితం అలా కావద్దనే పెళ్లి ప్లాన్ చేసిన శ్రీదేవి, ఆ తర్వాత ఏం జరిగిందంటే...

జాహ్నవి జీవితం అలా కావద్దనే పెళ్లి ప్లాన్ చేసిన శ్రీదేవి, ఆ తర్వాత ఏం జరిగిందంటే...

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ఇండియన్ సినిమా పరిశ్రమలో సూపర్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి పేరు, డబ్బు, హోదా, పలు ఉన్నత పురస్కారాలు అందుకున్నారు. కానీ ఇవి సాధించడం వెనక శ్రీదేవి ఎంత కష్టపడిందో, ఎన్ని త్యాగాలు చేసిందో కొందరికి మాత్రమే తెలుసు. 4 ఏళ్ల వయసు నుండే నటించడం ప్రారంభించిన శ్రీదేవి... అందరిలా సాధారణ జీవితాన్ని, సంతోషంగా గడపాల్సిన బాల్యాన్ని, అన్నింటికంటే ముఖ్యంగా స్కూలు, కాలేజీ లైఫ్ కోల్పోయారు.

  Janhvi Kapoor Celebrates Her 21st Birthday జాహ్నవి కపూర్ పుట్టినరోజు వేడుక
   తన కూతురు జీవితం తనలా కావొద్దు అనుకుంది

  తన కూతురు జీవితం తనలా కావొద్దు అనుకుంది

  శ్రీదేవి తలుచుకుంటే తనలాగే తన కూతుళ్లను కూడా బాలనటులుగా పరిచయం చేసి ఉండేది. కానీ ఆమె అలా చేయలేదు. ప్రతి మనిషి జీవితంలో ఎలాంటి ఒత్తిడి లేని సంతోషకరమైన బాల్యం, చదువు ఎంతో ముఖ్యం.... శ్రీదేవికి వాటి విలువ తెలుసు కాబట్టే తన పిల్లలను చిన్నతనం నుండి సినిమా పరిశ్రమకు దూరంగా ఉంచారు.

  బాగా చదువుకోవాలని ఆశ పడింది

  బాగా చదువుకోవాలని ఆశ పడింది

  చిన్నతనం నుండి వరుస సినిమాలతో బిజీగా గడపటంతో శ్రీదేవి పెద్దగా చదువుకోలేక పోయారు. షూటింగ్ లేని సమయాల్లో ఓ టీచర్ ఇంటికి వచ్చి ఆమెకు చదువు నేర్పించేవారట. శ్రీదేవికి ఎలాంటి స్కూలు, కాలేజీ సర్టిఫికెట్స్ కానీ, చదువుల్లో గ్రేడ్ కానీ లేదు. తన కూతుళ్ల జీవితం అలా కాకూడదనే శ్రీదేవి తన ఇద్దరు కూతుళ్లకు చిన్న తనం నుండి చదువు విషయంలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు.

   చదువు పూర్తయిన వెంటనే పెళ్లి చేయాలనుకుంది

  చదువు పూర్తయిన వెంటనే పెళ్లి చేయాలనుకుంది

  చాలా లేటుగా పెళ్లి చేసుకున్న శ్రీదేవి.... కొన్ని పరిస్థితుల వల్ల బోనీ కపూర్ రెండో భార్యగా వెళ్లాల్సి వచ్చింది. తొలినాళ్లలో అత్తింట్లో చాలా కష్టాలు పడింది. బోనీ మొదటి భార్యతో గొడవల కారణంగా మానసికంగా సంఘర్షణకు గురైంది. అందుకే తన పెద్ద కూతురు జాహ్నవిని బాగా చదివించి.... మంచి కుర్రాడికి ఇచ్చిపెళ్లి చేయాలని ఆశ పడింది.

   జాహ్నవి పెళ్లి విషయం స్వయంగా వెల్లడించిన శ్రీదేవి

  జాహ్నవి పెళ్లి విషయం స్వయంగా వెల్లడించిన శ్రీదేవి

  2012లో శ్రీదేవి నటించిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్' మూవీ రిలీజైంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి మాట్లాడుతూ..... ఒక తల్లిగా జాహ్నవి చదువు పూర్తయిన వెంటనే పెళ్లి చేయాలని ఆశ పడుతున్నట్లు స్వయంగా వెల్లడించారు.

   తనలాగే జాహ్నవి సినిమా స్టార్ కావాలని ఉన్నా

  తనలాగే జాహ్నవి సినిమా స్టార్ కావాలని ఉన్నా

  తనలాగే జాహ్నవి కూడా సినిమా రంగంలోకి వచ్చి మంచి పేరు, హోదా సంపాదించాలని శ్రీదేవికి ఉండేది. కానీ ఈ రంగంలో ఉండే కష్టనష్టాలు కూడా ఆమెకు తెలుసు కాబట్టి శ్రీదేవి మొదట తన కూతురును సినిమా రంగం వైపు తీసుకురావడానికి ఇష్టపడలేదు.

   కానీ జాహ్నవి ఆశపడటంతో...

  కానీ జాహ్నవి ఆశపడటంతో...

  సినిమా కుటుంబంలో, సినిమా వాతావరణంలో పెరిగిన జాహ్నవి..... తన కజిన్స్ మాదిరిగానే ఇండస్ట్రీలోకి వెళ్లాలని, గ్లామర్ ప్రపంచంలో పెద్ద స్టార్ కావాలని ఆశ పడింది. జాహ్నవి ఇష్టాన్ని కాదనలేక శ్రీదేవి కూడా ఓకే చెప్పింది.

   ‘ధడక్' మూవీ

  ‘ధడక్' మూవీ

  జాహ్నవిని హీరోయిన్‌గా పరిచయం చేసే క్రమంలో శ్రీదేవి చాలా కథలు విన్నారు. అయితే అవేవీ ఆమెకు సంతృప్తినివ్వలేదు. మరాఠీ హిట్ మూవీ ‘సైరాట్' కథ నచ్చడంతో దాన్నే ‘ధడక్' పేరుతో హిందీలో రీమేక్ చేయడానికి అంగీకరించారు.

  కూతురి తొలి సినిమా చూడక ముందే...

  కూతురి తొలి సినిమా చూడక ముందే...

  కూతురు తెరంగ్రేటం చేస్తున్న తొలి సినిమా చూడకముందే దేశం కాని దేశంలో ప్రమాద వశాత్తు శ్రీదేవి మరణించడం అందరినీ షాక్‌కు గురి చేసింది. బంధువల పెళ్లి కోసం దుబాయ్ వెళ్లిన ఆమె హోటల్ గదిలోని బాత్ టబ్‌లో పడిపోయి ప్రమాద వశాత్తు మరణించారు. శ్రీదేవి మరణంతో అభిమాన లోకం మొత్తం విషాదంలో మునిగిపోయింది.

   రామేశ్వరంలో శ్రీదేవి అస్తికలు

  రామేశ్వరంలో శ్రీదేవి అస్తికలు

  కాగా... శ్రీదేవి అస్తికలు సముద్రంలో కలిపేందుకు బోనీ కపూర్ కుటుంబ సభ్యులు ఇటీవల రామేశ్వరం వచ్చారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శ్రీదేవి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు చేసేందుకు బోనీ కపూర్ కుటుంబం హరిద్వార్ వెళ్లారు.

  English summary
  Sridevi had talked about Janhvi's marriage in an interview with Mumbai Mirror in 2012, when English Vinglish released. The veteran actress had said: "I am perturbed by the rumors about her getting ready for films. She hasn't even decided what she wants to do in life. Right now, I want her to concentrate on studies. When she completes her studies, ideally I would like her to get married and settle down."
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more