మీడియా ముందు శ్రీదేవి ఓవరాక్షన్... కూతురును బలవంతంగా లాక్కెళ్లింది (వైరల్ వీడియో)
ప్రముఖ నటి శ్రీదేవి మీడియా ముందు ఓవరాక్షన్ చేసింది. కూతురును బలవంతంగా లాక్కెంది. అందరి ముందు అలా చేయడంతో జాహ్నవి కపూర్ సైతం ఇబ్బంది పడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. శ్రీదేవి ప్రవర్తన చూసి అంతా ఆశ్చర్యపోయారు.

అసలు ఏం జరిగింది?
ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఫ్యాషన్ షోకు శ్రీదేవి, జాహ్నవి కపూర్ కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి చేతిలో చేయ్యేసుకుని ర్యాంప్ వాక్ చేశారు. తర్వాత ఫోటోగ్రాఫర్లు వారిని సపరేట్ సపరేట్‌గా ర్యాంప్ వాక్ చేయాలని కోరగా ముందు శ్రీదేవి ర్యాంప్ వాక్ చేశారు. ఆ సమయంలో జాహ్నవి పక్కన నిలపడింది. ఆమె తర్వాత జాహ్నవి సింగిల్ గా ర్యాంప్ వాక్ చేయడానికి సిద్ధమవ్వగా.... శ్రీదేవి తన కూతురు వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి ఆమెను లాక్కెల్లింది.

జాహ్నవి డిసప్పాయింట్
ఈ చర్యతో జాహ్నవి కపూర్ డిసప్పాయింట్ అయింది. ఫోటోగ్రాఫర్ల వైపు చూస్తూ బాధగా... మా మమ్మీ ఒప్పుకోవడం లేదు అనే అర్థం వచ్చేలా మొహం పెట్టేసి అందరికీ బై బై చెబుతూ అక్కడి నుండి వెళ్లిపోయింది.

శ్రీదేవి ఎందుకిలా చేసింది?
జాహ్నవి కపూర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు నుండే శ్రీదేవి ఎక్కడికి వెళ్లినా తన వెంట జాహ్నవిని తీసుకెళ్లేది. ఫోటోలకు ఫోజులు ఇచ్చేది. ఇపుడు జాహ్నవి ‘ధడక్' సినిమాలో నటిస్తోంది. వాస్తవానికి అప్పటి కంటే ఇప్పుడే ఆమె ఫోటోగ్రాఫర్ల దృష్టిలో పడాలి. ఫ్యాషన్ షోలో జాహ్నవి ఒంటరిగా ర్యాంప్ వాక్ చేయకుండా, ఫోటోలకు ఫోజులు ఇవ్వకుండా శ్రీదేవి ఎందుకు అడ్డుకుందో ఎవరికీ అర్థం కావడం లేదు.
వైరల్‌గా మారిన వీడియో
సోషల్ మీడియాలో శ్రీదేవి ఓవరాక్షన్‌కు సంబంధించిన వీడియో వైరల్ అయింది. పాపం జాహ్నవి అంటూ....అందరూ జాలి చూపిస్తున్నారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

ధడక్
శ్రీదేవి వారసత్వంలో జాహ్నవి కపూర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. 'ధడక్' అనే సినిమా ద్వారా ఆమె హీరోయిన్ గా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే.

జులైలో రిలీజ్
ధడక్ మూవీలో జాహ్నవి కపూర్‌తో పాటు షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్ కూడా వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మాత. మరాఠీ హిట్ మూవీ ‘సైరాట్' చిత్రానికి ఇది రీమేక్. జులై 6, 2018లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

శ్రీదేవి కూతురు హాట్ హాట్: సెక్స్ అప్పీల్ సూపర్, ఫిదా అయిపోతారు!
ఈ తరం హీరోయిన్ అన్నాక కావాల్సినంత సెక్స్ అప్పీల్ ఉండాలి. చూడగానే కుర్రాళ్ల మతిపోయే విధంగా ఉండాలి. జాహ్నవి కపూర్ ఈ విషయంలో పర్ ఫెక్టుగా ఫిజిక్ మెయింటేన్ చేస్తుంది. చూస్తుంటే రాబోయే కాలంలో అమ్మడు బాలీవుడ్‌ను తన అందంతో ఊపేసేలా ఉంది.


Click it and Unblock the Notifications











