»   » పబ్లిక్‌లో శ్రీదేవిని కొట్టిన బోనీ కపూర్ తల్లి, దారుణమైన మోసం: వర్మ లెటర్ సంచలనం!

పబ్లిక్‌లో శ్రీదేవిని కొట్టిన బోనీ కపూర్ తల్లి, దారుణమైన మోసం: వర్మ లెటర్ సంచలనం!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sridevi's Other Side : RGV Reveals Unknown Life Of Sridevi

శ్రీదేవిని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆరాధించినంతగా ఇంకెవరూ ఆరాధించి ఉండరేమో. తన దేవత మరణించిన విషయాన్ని వర్మ తట్టుకోలేక పోతున్నారు. శ్రీదేవి మరణవార్త విన్న వెంటనే తన బాధను వర్మ వరుస ట్వీట్ల రూపంలో వ్యక్తి పరిచాడు. తాజాగా మై లవ్ లెటర్ టు శ్రీదేవి ఫ్యాన్స్ అంటూ ఆయన ఓ లేఖను విడుదల చేశారు. అందులో పలు సంచలన విషయాలు చెప్పుకొచ్చారు వర్మ.

ఆమెను ఎంతగానో ఆరాధించాను

ఆమెను ఎంతగానో ఆరాధించాను

కోట్లాది మీలాంటి అభిమనుల్లానే నేను కూడా శ్రీదేవిని మోస్ట్ బ్యూటిఫుల్, డిజైరబుల్ ఉమెన్‌గా ఆరాధించాను. ఆమె ఈ దేశంలో అతిపెద్ద సూపర్ స్టార్ అని, 20 ఏళ్ల పాటు సిల్వర్ స్క్రీన్‌ను రారాణి లాగా ఏలిందని మనందరికి తెలుసు..... అని వర్మ తన లేఖలో పేర్కొన్నారు.

 శ్రీదేవి మరణం చాలా దారుణంగా

శ్రీదేవి మరణం చాలా దారుణంగా

శ్రీదేవి మరణంపై వెనక వినిపిస్తున్న వార్తలతో రామ్ గోపాల్ వర్మ కూడా చాలా దిగ్బ్రాంతికి గురైనట్లు తెలుస్తోంది. ఆమె జీవితం మాదిరిగానే.... ఆమె మరణం కూడా చాలా మిస్టీరియస్‌గా ఉందనే అభిప్రాయాన్ని రామ్ గోపాల్ వర్మ తన లేఖలో పేర్కొన్నారు.

సంచలన విషయాలు

సంచలన విషయాలు

చాలా మంది శ్రీదేవి జీవితం పర్‌ఫెక్ట్ అని భావిస్తుంటారు. అందమైన ముఖం, గ్రేట్ టాలెంట్, ఇద్దరు కూతుళ్లతో మంచి ఫ్యామిలీ..... బయటి నుండి చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. కానీ శ్రీదేవి హ్యాపీ లైఫ్ లీడ్ చేసిందా? అంటే చెప్పాల్సింది చాలా ఉంది అంటూ వర్మ కొన్ని సంచలన విషయాలు బయట పెట్టారు.

 తండ్రి మరణం తర్వాత పంజరంలో పక్షిలా

తండ్రి మరణం తర్వాత పంజరంలో పక్షిలా

నేను శ్రీదేవిని కలిసి సమయం నుండి ఆమె జీవితం గురించి తెలుసు. నా కళ్లతో ఆమె జీవితాన్ని చాలా దగ్గరుండి చూశాను. ఆమె తండ్రి మరణించే ముందు వరకు ఆమె జీవితం ఆకాశంలో ఎగిరే పక్షిలా ఉండేది. కానీ ఓవర్ ప్రొటెక్టివ్‌గా ఉండే ఆమె తల్లి వల్ల ఆమె జీవితం పంజరంలో పక్షిలా మారింది... అని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు.

అప్పట్లో అంతా బ్లాక్ మనీ, మోసం చేశారు

అప్పట్లో అంతా బ్లాక్ మనీ, మోసం చేశారు

అప్పట్లో నటీనటులకు నిర్మాతలు ఎక్కువగా బ్లాక్ మనీ చెల్లించేవారు. ఐటి రైడ్స్ భయంతో ఆమె తండ్రి డబ్బును నమ్మకమైన తన స్నేహితులు, బంధువుల వద్ద దాచేవారు. అయితే శ్రీదేవి తండ్రి మరణంతో వారంతా డబ్బు తిరిగి ఇవ్వకుండా ఆమెను మోసం చేశారు అని వర్మ చెప్పుకొచ్చారు.

 తల్లి వల్ల డబ్బంతా పోయింది

తల్లి వల్ల డబ్బంతా పోయింది

శ్రీదేవి తల్లి లిటిగేషన్లో ఉన్న ప్రాపర్టీలు కొనుగోలు చేసింది. ఆమె చేసిన ఇతర తప్పులు కూడా శ్రీదేవి డబ్బు అంతా కరిగిపోయేలా చేసింది. బోనీ కపూర్ శ్రీదేవి జీవితంలోకి ప్రవేశించే సమయానికి ఆమె వద్ద ఎలాంటి ఆస్తులు లేకుండా అయిపోయాయి అని.... వర్మ తన లెటర్లో చెప్పుకొచ్చారు.

 సోదరి మోసం చేసింది

సోదరి మోసం చేసింది

శ్రీదేవి తల్లికి యూఎస్ఏలో బ్రెయిన్ సర్జరీ తప్పుగా జరుగడం వల్ల ఆమె మెంటల్ పేషెంట్ అయిపోయింది. తర్వాత శ్రీదేవి చెల్లెలు శ్రీలత తన ఇంటి పక్కన ఉండే వ్యక్తిని పారిపోయి పెళ్లి చేసుకుంది. శ్రీదేవి మదర్ చనిపోయే ముందు ఆస్తులన్నీ శ్రీదేవి పేరు మీదనే రాసింది. కానీ శ్రీదేవి సోదరి ఆమెపై కేసు వేసింది. వీలునామా రేసే సమయంలో తన తల్లి మాసినకంగా సరిగా లేదని చెప్పి శ్రీదేవి వద్ద నుండి ఆస్తి లాక్కుంది అని..... రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు.

 బోనీ తల్లి శ్రీదేవిని పబ్లిక్‌గా కొట్టింది

బోనీ తల్లి శ్రీదేవిని పబ్లిక్‌గా కొట్టింది

బోనీ కపూర్ తల్లి శ్రీదేవిని ఇష్టపడలేదు. ఆమె వల్ల తన ఇల్లు ముక్కలవుతుందని చిత్రీకరించింది. శ్రీదేవిని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లాబీలో పబ్లిగ్గా కడుపులో కొట్టింది. ఇదంతా ఆమె బోనీ కపూర్ మొదటి భార్య మోనా కోసమే చేసింది.... అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.

 ఎవరికీ తెలియవు

ఎవరికీ తెలియవు

ఇప్పటి వరకు ఎవరికీ తెలియని విషయాలను రామ్ గోపాల్ వర్మ బయట పెట్టడంతో అభిమానులు సైతం షాకవుతున్నారు. పైకి అందంగా కనిపించే శ్రీదేవి జీవితం వెనక ఇంత విషయం దాగి ఉందా? అని ఆశ్చర్య పోతున్నారు.

మరణం కూడా మిస్టరీనే

శ్రీదేవి జీవితం మాదిరిగానే, ఆమె మరణం కూడా చాలా మిస్టరీగా ఉంది. దుబాయ్ లో ఆమె అత్యంత దయనీయ స్థితిలో మరణించడం అందరినీ కలిచి వేస్తోంది. దీంతో పాటు తాజాగా వర్మ బయట పెట్టిన విషయాలు అభిమానులను షాక్‌కు గురి చేస్తున్నాయి.

English summary
"Boney ‘s mother portrayed her as a home breaker and publically punched her in the stomach in a five star hotel lobby for what she did to Boney’s first wife Mona" Ram Gopal Varma's letter SAID.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu