కూతుళ్లను డామినేట్ చేస్తోంది..(శ్రీదేవి మరో హాట్ ఫోటో)
హైదరాబాద్: హాట్ హీరోయిన్ శ్రీదేవి ఇటీవల న్యూఇయర్ వేడుకను పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవులకు వెకేషన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీదేవి తన స్విమ్ సూట్ ఫోటోలు ట్విట్టర్లో పోస్టు సంచలనం సృష్టించింది. శ్రీదేవి అందాలు అదరహో అంటూ...దేశ వ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు.
కాగా...తాజాగా శ్రీదేవి మరో హాట్ ఫోటోను సోషల్ నెట్వర్కింగులో పోస్టు చేసింది. ఇద్దరు కూతుర్లతో కలిసి చిట్టి పొట్టి దుస్తుల్లో ఉన్న ఈ ఫోటో ఇపుడు ఇంటర్నెట్‍లో సంచలనం సృష్టిస్తోంది. కూతుర్లను డామినేట్ చేసే విధంగా శ్రీదేవి హాట్ అండ్ సెక్సీ లుక్‌తో ఉండటం గమనార్హం.

ఈ వయసులో శ్రీదేవి అందాలు చెక్కు చెదరలేదని పలువురు అభిమానులు పొగిడేస్తుంటే...మరికొందరేమో ఈ శ్రీదేవి ఈ వయసులో ఇంత హాట్ హాట్ ఫోటోలు పోస్టు చేయడం ఏమిటని ముక్కున వేలేసుకున్నారు. 50 ఏళ్ల వయసులోనూ శ్రీదేవి అతిలోక సుందరిలా నవనవలాడుతోందంటూ మీడియా కోడై కూసింది.
ఈ పరిణామాలతో శ్రీదేవి ఒక్కసారిగా షాకైంది. ఆ ఫోటోలు ఎలా ట్విట్టరోకి వచ్చాయో అర్థం కావడం లేదని....బహుషా ఇది మా పిల్లల పనే అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేసింది. తనకు తెలియకుండానే ఈ ఫోటోలు ట్విట్టర్లోకి వచ్చాయని వివరణ ఇచ్చుకుంది.


Click it and Unblock the Notifications











