మమ్మీ హర్టైంది, శ్రీదేవి డాడీ భార్యనే: అర్జున్
ముంబై: తమ డాడీ బోనీ కపూర్ శ్రీదేవిని వివాహమాడినప్పుడు తన తల్లి మోనా కపూర్ బాధపడిందని నటుడు అర్జున్ కపూర్ చెప్పాడు. కోఫీ విత్ కరణ్ కార్యక్రమంలో రణవీర్ కపూర్‌తో అర్జున్ కపూర్ పలు విషయాలపై గురించి మాట్లాడాడు. తన సవతి తల్లి శ్రీదేవితో తనకు గల సంబంధంపై, దీపికా పడుకొనే విషయంలో తనపై చెలరేగుతున్న ఊహాగానాలపై అర్జున్ కపూర్ మాట్లాడాడు.
గతంలో తన తండ్రితో గల సంబంధం దెబ్బ తినడంపై అర్డున్ కపూర్ తొలిసారి పెదవి విప్పాడు. శ్రీదేవిని పెళ్లి చేసుకోవడానికి తన తండ్రి బోనీ కపూర్ వెళ్లి పోయినప్పుడు తన తల్లి ఎంతగానే బాధపడిందని అతను చెప్పాడు. శ్రీదేవిపై తనకు గౌరవం ఉందని, తన తండ్రి బోనీ కపూర్‌కు తనను చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించారని అతను వివరించాడు.

వెకేషన్స్‌లో తన తండ్రి, సవతి తల్లితో కలిసి వెళ్లిన విషయం గురించి కూడా అతను మాట్లాడాడు. వారితో పాటు వారి ఇద్దరు పిల్లలు కూడా ఉండడంతో తనకు కాస్తా ఎబ్బెట్టుగా అనిపించిందని అర్జున్ చెప్పాడు. తనకు శ్రీదేవి అంటే గౌరవం ఉందని, ఆమె ఎప్పుడు కూడా తన తండ్రి భార్య మాత్రమేనని అన్నాడు.
మోనా కపూర్ మరణం తర్వాత అర్జున్ యోగక్షేమాలను శ్రీదేవి పట్టించుకుంది. అతని కెరీర్ పట్ల కూడా శ్రద్ధ చూపింది. అతని తొలి సినిమా ఇషాక్‌జాదే విజయం సాధించాలని ఆమె శుభాకాంక్షలు తెలిపింది.


Click it and Unblock the Notifications











