ఫ్యాషన్ షోలో పొట్టి డ్రెస్‌తో పిచ్చెక్కించిన శ్రీదేవి
అలనాటి అందాల నటి శ్రీదేవి ఇటీవల జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో అభిమాలకు పిచ్చెక్కించింది. తన కూతురుతో కలిసి పొట్టి డ్రెస్సులో దర్శనం ఇచ్చిన ఆమెను చూసి అంతా షాకయ్యారు. చాలా మంది ఆవిడకు ఆడ్రెస్ సూటు కాలేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పైగా శ్రీదేవి చాలా బక్క చిక్కి ఉండటంపై కూడా కొందరు అభిమానులు అంతృప్తిని ప్రదర్శించారు. కూతురు సినీ భవిష్యత్, తన సెకండ్ ఇన్నింగ్స్‌ను దృష్ట్యా శ్రీదేవి ఈ మధ్య తరచూ ఇలా ఫ్యాషన్ షోలలో తళుక్కుమంటోంది.
ప్రస్తుతం శ్రీదేవి 'ఇంగ్లిష్ వింగ్లిస్' అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. గౌరీ షిండే దర్శకత్వం వహిస్తున్న 'ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రం ద్వారా ఆమె మళ్లీ రంగుల సినీ ప్రపంచంలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇంగ్లీష్ సరిగా మాట్లాడటం రాని ఓ గృహిణి పాత్రలో నటిస్తున్న శ్రీదేవి..బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ భార్య గా నటిస్తోంది. తన వచ్చి రాని ఇంగ్లీష్ తో నవ్వుల పాలపాలవుతున్న తనను తాను మార్చుకోవడానికి ఇంగీష్ కోర్సులో జాయిన్ అవుతుంది. ఈ సినిమాలో శ్రీదేవి ఫ్రెంచి యాక్టర్ మెహ్దినిబూతో రొమాన్స్ చేస్తుందట. తను ఇంగ్లిష్ నేర్చుకోవడానికి వెళ్లిన చోట ఇతగాడు శ్రీదేవికి పరిచయం అవుతాడట. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య లవ్ అండ్ రొమాన్స్ చోటు చేసుకుంటాయని సమాచారం.


Click it and Unblock the Notifications












