twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అన్ని కోట్లా...? ‘నా పేరు సూర్య’ బడ్జెట్ వెల్లడించి షాకిచ్చిన నిర్మాత!

    By Bojja Kumar
    |

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా". కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. మే 4న సినిమా విడుదల చేస్తున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.... సినిమా బడ్జెట్ గురించి వెల్లడించి షాకిచ్చారు.

    బన్నీ పదేళ్ల క్రితం మాటిచ్చారు

    బన్నీ పదేళ్ల క్రితం మాటిచ్చారు

    'ఇంత మంచి సినిమా చేసే అవకాశం రావడానికి కారణం బన్నీ. 'ఎవడి గోలవాడిదే', 'స్టైల్‌' సినిమాలు చూసిన బన్ని ఓ పార్టీలో నాకు కాంప్లిమెంట్‌ ఇస్తే 'ఏం చేస్తాం బన్ని మీలాంటి స్టార్స్‌తో సినిమాలు చేస్తే బావుంటుంది' అన్నాను. పదేళ్ల క్రితం బన్ని ఇచ్చిన మాట కోసం ఈ సినిమా చేశారు. అంత కన్నా గొప్ప అవార్డు మరోటి లేదనిపించింది.' అని లగడపాటి శ్రీధర్ తెలిపారు.

    తెలుగు సినిమా చరిత్రలోనే నిలిచిపోయేలా

    తెలుగు సినిమా చరిత్రలోనే నిలిచిపోయేలా

    ఈ సినిమాను తెలుగు సినిమా చరిత్రలోనే నిలిచిపోయేలా ప్రేక్షకులు చేస్తారు. వక్కంతం వంశీగారు అద్భుతమైన కథ ఇచ్చారు. అంతే కాదు.. చక్కగా తెరకెక్కించారు. సామాజిక బాధ్యత ఉన్న సినిమా ఇది. వారికి జీవితాంతం రుణపడి ఉంటాను. భవిష్యత్‌లో తను ఎప్పుడంటే అప్పుడు ఎంత పెద్ద బడ్జెట్‌ మూవీ అయినా చేద్దామంటే నేను సిద్ధంగా ఉంటాను అని శ్రీధర్ తెలిపారు.

    ఈ ఒక్క సినిమా విషయంలో నువ్వే కెప్టెన్ బన్నీ

    ఈ ఒక్క సినిమా విషయంలో నువ్వే కెప్టెన్ బన్నీ

    మా అందరికీ ఈ అవకాశం ఇచ్చింది .. ఇట్స్ యూ బన్నీ, కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ అంటారు... ఈ ఒక్క సినిమా విషయంలో నువ్వే కెప్టెన్ బన్నీ అంటూ శ్రీధర్ లగడపాటి వ్యాఖ్యానించారు.

    రూ. 100 కోట్ల బడ్జెట్

    రూ. 100 కోట్ల బడ్జెట్

    వక్కంతం వంశీ కొత్త డైరెక్టర్. ఈ రోజుల్లో వంద కోట్ల బడ్జెట్ ఒక కొత్త డైరెక్టర్‌కు ఇవ్వడం అనేది ఇంపాజిబుల్. బన్నీకి ఎంతో అద్భుతమైన కెరీర్ ఉంది. ఆయన రిస్క్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంత రిస్క్ చేశాడంటే... బన్నీ జడ్జిమెంటుకు హాట్సాఫ్.... అని శ్రీధర్ లగడపాటి చెప్పుకొచ్చారు.

    ఈ సినిమా మీద మాకు రెట్టింపు కాన్ఫిడెన్స్ ఉంది

    ఈ సినిమా మీద మాకు రెట్టింపు కాన్ఫిడెన్స్ ఉంది

    ఈ సినిమా మీద మాకు రెట్టింపు కాన్ఫిడెన్స్ ఉంది. మళయాలం, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలవుతోంది. హిందీ కూడా చేయడానికి ప్రయత్నించాం. సెన్సార్ కార్యక్రమాలను అందుకోలేక అది సాధ్యం కాలేదు. కానీ తప్పకుండా హిందీ రిలీజ్ ఉంటుంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయని గన్ షాట్ గా చెబుతున్నాను... అని శ్రీధర్ లగడపాటి తెలిపారు.

    English summary
    Sridhar Lagadapati speech at Naa Peru Surya Na Illu India Pre Release Event. Allu Aravind Speech at Naa Peru Surya Na Illu India Pre Release Event. Starring #AlluArjun, #AnuEmmanuel, Music composed by Vishal–Shekhar, Directed by Vakkantham Vamsi and Produced by Sirisha Sridhar Lagadapati, Bunny Vas under the banner of Ramalakshmi Cine Creations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X