అమ్మ రాజశేఖర్ గేలానికి ఆ హీరోనే పడ్డాడు
ఖతర్నాక్, భీభత్సం, టక్కరి అంటూ వరస పెట్టి ప్లాపులు ఇచ్చిన దర్శకుడు అమ్మ రాజశేఖర్. దానికి తోడు ఆ మధ్య వెంకటేష్ తో గంగ...ది డాన్ అని ప్రారంభించే లోపలే ఆగిపోయింది. దాంతో మరో హీరో కోసం ట్రై చేసిన రాజశేకర్ మొత్తానికి తనే హీరోగా మారి, మరో హీరో శ్రీహని పట్టి ఓ సినిమా ఓపెన్ చేసారు. డాన్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై డి.లివింగ్ స్టన్ నిర్మించే చిత్రం నానక్ రామ్ గూడాలోని రామానాయుడు సినిమా విలేజ్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ...'శ్రీహరిగారిని నేను 'బావ' అని పిలుస్తాను. మా బావ, నేను కలిసి ఈ చిత్రంలో హీరోలుగా నటిస్తున్నాం. నేను నటిస్తున్న తొలి చిత్రం ఇదే. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే హీరోలు. నేను ఎంతో కష్టపడి తయారు చేసుకున్న కథ ఇది. మా బావ సహకారంతో తెరకు ఎక్కిస్తున్నాను. తొలి షెడ్యూల్ 15 రోజుల పాటు జరుగుతుంది. అక్టోబరు నుంచి రెండో షెడ్యూల్ ఉంటుంది' అన్నారు అమ్మరాజశేఖర్.
అలాగే శ్రీహరి మాట్లాడుతూ 'అమ్మరాజశేఖర్ చెప్పిన కథ బాగా నచ్చి వెంటనే షూటింగ్ ప్రారంభించమని చెప్పాను. అద్భుతమైన స్క్రిప్ట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం నటిస్తోంది' అన్నారు. ఈ సినిమా పూజాకార్యక్రమాలను ఈ నెల 19న రామోజీ ఫిలింసిటిలో నిర్వహించనట్లు నిర్మాత లివింగ్ స్టన్ చెప్పారు. ఈ చిత్రానికి రచనాసహకారం: చందు పందిరి, పాటలు: సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌తేజ, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: స్టడీకామ్ శ్రీధర్, నిర్మాత: డి.లివింగ్ స్టన్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, కొరియోగ్రఫీ, దర్శకత్వం: అమ్మ రాజశేఖర్. ఈ చిత్రంలో ఆర్తి అగర్వాల్, రమ్య(నూతన పరిచయం), బ్రహ్మానందం, ఆలీ, రఘుబాబు, శ్రీ, శ్రావణ్, సుప్రీత్, టార్జాన్ ఇతర ముఖ్యతారాగణం. ఇక ఈ చిత్రానికి పోరు అనే టైటిల్ పెట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











