15 ఏళ్ళ తర్వాత హీరో శ్రీహరి మళ్ళీ విలన్ గా..
దాదాపు శ్రీహరి 15 సంవత్సరాల తర్వాత విలన్‌గా నటించటానికి రెడీ అవుతున్నారు. విలన్ నుంచి హీరోగా ఎదిగిన శ్రీహరిని ఆ తర్వాత చాలా మంది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కోసం అడిగారు..కానీ ఆయన ఎప్పుడూ ఒప్పుకోలేదు. అయితే ఆయన ఫైట్ మాస్టర్ విజయన్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం మార్క్ కోసం విలన్ అవతారం ఎత్తుతున్నారు. అలా విలన్ గా మారటానికి కారణం..విజయన్ కుమారుడు శబరీష్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం కావటమే. ఇక ఈ చిత్రానికి నట్టికుమార్ నిర్మాత. బుధవారం హైదరాబాద్ లో ఈ చిత్రం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి హీరో వెంకటేష్ క్లాప్‌నిచ్చారు. దర్శకుడు రాజమౌళి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రంలో బ్యాంకా క్ నటి పింకీ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. అలాగే ఈ చిత్రానికి కెమెరా: శశి, కళ: నాగేందర్, నృత్యాలు: రాజు సుందరం, నోబుల్, దిన, కూర్పు: రాజు మహమ్మద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, ఫైట్స్ : విజయన్.


Click it and Unblock the Notifications











