ఎన్ని సినిమాలో అర్థం కావట్లేదు: హీరో శ్రీహరి సందడి
తనకు అవకాశాలు బాగా వస్తున్నాయని చెప్పారు. ఆయన అమీర్‌పేటలో కొత్తగా ఏర్పాటు చేసిన జావా లర్నింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సమయంలో ఆయన అక్కడ సందడి చేశారు. శ్రీహరి వచ్చారని తెలియడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడకు చేరుకున్నారు.
సెంటర్‌ను ప్రారంభించేందుకు వచ్చిన శ్రీహరికి యాజమాన్యం పూలతో సాదరంగా స్వాగతించింది. అనంతరం పలువురితో కలిసి శ్రీహరి ఫోటోలు దిగారు. సెంటర్‌ను ప్రారంభించి, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాగా చిన్న చిన్న పాత్రలతో టాలీవుడ్‌లోకి ప్రవేశించిన శ్రీహరి ఆ తర్వాత విలన్‌గా, హీరోగా మారారు.
ఇటీవల ఆయన హీరోగా కనిపించడంతో పాటు ఎక్కువగా ఇతర హీరోలు ఉన్న సినిమాలలో ప్రధాన పాత్రధారిగా నటిస్తున్నారు. మగధీర, ఢీ వంటి చిత్రాల్లో నటిస్తూ హీరోకు ధీటుగా ప్రత్యేకత కనబరుస్తున్నారు. శ్రీహరి నటుడిగా ఎంత పేరు సంపాదించుకున్నారో మానవత్వం ఉన్న వ్యక్తిగా అంతకంటే మంచిపేరు సంపాదించుకున్నారు.


Click it and Unblock the Notifications












