తప్పుడు ప్రచారమే, శ్రీహరికి ఆ వ్యాధి లేదు: ప్రభుదేవా

By Bojja Kumar

హైదరాబాద్: రెండు రోజుల క్రితం హఠాన్మరణం చెందిన శ్రీహరిపై రకరకాలుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆయనకు కాలేయ సంబంధ వ్యాధి ఉందని, లివర్ క్యాన్సర్ వల్లనే ఆయన మరణించారని పుకార్లు షికార్లు చేసాయి. బలమైన ఫిజిక్‌తో ఉండే శ్రీహరి కొన్ని రోజులుగా చిక్కిపోయి కన్పించడం కూడా ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది.

అయితే ఇదంతా తప్పుడు ప్రచారమే అంటున్నారు దర్శకుడు ప్రభుదేవా. తాను దర్శకత్వం వహిస్తున్న 'రాంబో రాజ్ కుమార్' సినిమా షూటింగులో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారని, శ్రీహరి చనిపోయారంటే ఇప్పటికీ నమ్మలేక పోతున్నానని తెలిపారు.

శ్రీహరికి కేన్సర్ వచ్చినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని, ముంబైలో షూటింగ్ పూర్తయ్యాక ఆయన అస్వస్థతకు గురయ్యారు. గుండె పోటు రావడం వల్లనే ఆయన చనిపోయారు అని ప్రభుదేవా వెల్లడించారు. ఆయన ఎప్పుడూ ఎంతో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌గా ఉంటారు అని ప్రభుదేవా వెల్లడించారు.

శ్రీహరి భార్య కూడా ఇదే విషయం వెల్లడించారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ...ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాంబో రాజ్ కుమార్ అనే హిందీ సినిమా షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లినట్లు తెలిపారు. సినిమా షూటింగులో ఉత్సాహంగా పాల్గొన్నారని ఆమె తెలిపారు. హోటల్ రూమ్‌లో పాలు తాగి పడుకున్నారని. కొంత సమయంత తర్వాత చాతి నొప్పిఉందని చెప్పి కుప్ప కూలిపోయారని, ఆయన్ను వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించినట్లు శాంతి తెలిపారు. వైద్యులు బృందం ఆయన్ను పరీక్షించి బీపీ డౌన్ అయిందని తెలిపారని, 4 గంటలకు మరణించినట్లు ధృవీకరించారని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X