శ్రీహరి బాలీవుడ్ ఎంట్రీ ఆ దర్శకుడుతో...
హైదరాబాద్ : ప్రకాష్ రాజ్,సుప్రీత్,అజయ్ తర్వాత మరో తెలుగు నటుడు బాలీవుడ్ లో తెరంగ్రేటం చేస్తున్నారు. అతనెవరో కాదు శ్రీహరి. ఆయన్ను బాలీవుడ్ కు పరిచయం చేస్తోంది...ప్రభుదేవా. ప్రభుదేవా తాజా చిత్రం రాంబో రాజ్ కుమార్ లో శ్రీహరి కీ రోల్ చేస్తున్నారు.
గతంలో శ్రీహరితో ప్రభుదేవా చేసి ఉన్నారు. నువ్వు వస్తానంటే నే వద్దంటానా హీరోయిన్ అన్నగా శ్రీహరి నిలిచిపోయే పాత్ర చేసి సినిమాని నిలబెట్టాడు. అది గుర్తు పెట్టుకుని ప్రభుదేవా ఈ ఆఫర్ ఇస్తున్నారు.
మరో ప్రక్క శ్రీహరి మరో బాలీవుడ్ దర్శకుడు అపూర్వ లఖియాతో తెలుగు వెర్షన్ జంజీర్ లో చేస్తున్నాడు. మెల్లిగా బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్న శ్రీహరి అక్కడా బిజీ అవుతాడంటున్నారు.
ఇక రాంబో రాజ్ కుమార్ లో షాహిద్ కపూర్,సోనాక్షి సిన్హా హీరో,హీరోయిన్స్ గా చేస్తున్నారు. సోనూ సూద్,ఆషిష్ విద్యార్ధి మిగతా కీ రోల్స్ లో కనిపించనున్నారు. ప్రభుదేవా డైరక్ట్ చేసిన నువ్వు వస్తానంటే నే వద్దంటానా చిత్రం విడుదలకు సిద్దమవుతోంది.


Click it and Unblock the Notifications












