ప్రివ్యూ చూసి భూమిక చాలా నిరుత్సాహపడింది
ప్రీమియర్ తర్వాత డివైడ్ టాక్ వచ్చింది. భూమక చాలా నిరుత్సాహపడ్డారు అంటున్నారు దర్శకుడు శ్రీహరి నాను. ఆయన తన తాజా చిత్రం తకిట తకిట గురించి మాట్లాడుతూ. అయితే నిదానమే ప్రదానంగా వెయిట్ అండ్‌సీ అనుకున్నాం. ఆ తర్వాత థియేటర్లలో మంచి స్పందన రావడంతో సంతోషాన్నిచ్చింది. యూత్ కోసమే చేసిన సినిమా అయినా పెద్దలు తప్పక చూడాల్సిన సినిమా అని చెప్తున్నారు. ఇక దర్శకునిగా సత్యభామ ఆ తర్వాత తకిటతకిట అయినా ఇలాంటి సినిమా చేశానని ఎప్పుడూ గిల్టీగా ఫీల్‌కాలేదు. అలా అనిపిస్తే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతాను అని చెప్పారు. అలాగే..తకిట తకిట చిత్రానికి డివైడ్ టాక్ రావడానికి కారణం చెపుతూ...వైవిధ్యం చేస్తే తప్పకుండా డివైడ్‌టాక్ వస్తుంది. స్క్రీన్‌ప్లే బేస్డ్ కథ కాబట్టి.. పిల్లలకు స్వాతంత్ర్యం ఇస్తూ నమ్మని కుటుంబం. పిల్లలు ఏమవుతారోనని భయపడే మరో కుటుంబం.. ఇలా ముగ్గురి ఫ్యామిలీ కథలో ఒక్కొక్కరికి కలిపి 9 కథలున్నాయి. వాటిని పూసలా గుచ్చి అమర్చడం సాహసమే. దీనివల్లే డివైడ్‌టాక్ వచ్చిందనుకుంటున్నా. టైటానిక్ సినిమా నచ్చనివారూ ఉన్నారు. ఎక్కువసార్లు చూసినవారు ఉన్నారుగా అని తేల్చి చెప్పారు. మొత్తానికి టైటానిక్..తకిట..తకిట ఒకే రేంజన్నమాట.


Click it and Unblock the Notifications











