»   »  భూమికతో పనిచేస్తే ఆ భెనిఫిట్...

భూమికతో పనిచేస్తే ఆ భెనిఫిట్...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Bhumika
భూమికది చాలా గొప్ప విశాల హృదయం అని వారంతా ఆమెను పొగుడుతున్నారు. ఎందుకంటే ఆమెని ప్రధాన పాత్రలో పెట్టి సత్యభామ అనే ఫ్లాఫ్ సినిమా రూపొందించిన శ్రీహరి నాను అనే దర్శకుడు కి మరో అవకాశం ఇస్తోందిట. అదీ ఆమె సొంత బ్యానర్ అయిన డౌన్ టౌన్ ప్రొడక్షన్ లోనట. ఇక సత్యభామ హాలీవుడ్ సినిమా ఫిఫ్టీ ఫస్ట్ డేస్ కు మక్కీకి మక్కీ కాపీ.

చివరకు షాట్ డివిజిన్ దగ్గర నుండీ కాపీకొట్టిన ఆ దర్శకుడు పై ఆమె సానుభూతి చూపి ఈ అవకాశం ఇస్తోంది. మరి ఈ సారి ఏ హాలీవుడ్ డీవీడీ చూపెట్టాడో అంటున్నారు. ఇక అలాంటి అవకాశం ఇస్తోందంటే ...సముధ్రకీ ఆమె తన బ్యానర్ లో అవకాశమిస్తుంది గ్యారెంటీగా అంటున్నారు. ఎందుకంటే బరాన్ సినిమాను కాపీ కొట్టే ప్రొసెస్ లో అతనూ బోల్తా కొట్టాడు కదా అని. ఏదైమైనా భూమిక హీరోయిన్ గా సినిమా రూపొందింస్తే తర్వాత వారి లైఫ్ కి ఆఫర్స్ ఢోకా ఉండదన్న మాట. మంచి విషయమేగా.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X