twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీహరి ఇక నుంచీ సర్కార్‌ గుండా..కాసుకోండి

    By Srikanya
    |

    డ్రగ్స్ బ్యాక్ డ్రాప్ లో శ్రీహరి హీరోగా దేవా ప్రొడక్షన్స్‌ పతాకంపై 'సర్కార్‌ గూండా" టైటిల్ తో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంతో సదా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. హైదరాబాద్‌ నానక్‌రామ్‌గుడ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరుపుకుని ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. హీరోపై చిత్రీకరించిన తొలిసన్నివేశానికి శ్రీహరి సతీమణి శాంతి క్లాప్‌నివ్వగా, విజయన్‌ మాస్టర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ 'ఈ దేశంలో ప్రభుత్వం జీతాలిచ్చి మనుషుల్ని చంపమనేది ఇద్దరినే..ఒకరు బోర్డర్‌లో సైనికుడు, ఇంకొకరు ఉరితీసే తలారి.

    నేనూ అలాంటివాడినే..ఇదే నా ఆరంభ డైలాగ్‌.నా పాత్ర స్వభావాన్ని చెప్పే డైలాగ్‌ అది. మత్తులో కూరుకుపోతున్న యువత చుట్టూ కథాంశం అల్లుకుని ఉంటుంది. ఆ మత్తును ఎవరు అలవాటు చేస్తున్నారు? భారతదేశ యువతను నిర్వీర్యం చేయాలని కంకణం కట్టుకున్నదెవరు? డ్రగ్‌మాఫియా ఎలా నడు స్తోంది?..ఇవన్నీ ప్రధానంగా చూపిస్తున్నాం. మత్తు నుంచి యూత్‌ను బైటికి తెచ్చే అంశాలు ఇందులో ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో ఓ యువజంట నటిస్తుంది. వారికోసం అన్వేషిస్తున్నాం" అన్నారు.

    English summary
    Real Star Srihari’s new film ‘Sarkar Goonda’ has been launched yesterday (Monday, 7 March) at Rama Naidu Studios, Hyderabad. Disco Shanti clapped for the first scene while fight Master Vijayan switched on the camera.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X