డ్రగ్ మాఫియాని ఎదుర్కున్న శ్రీహరి
ఇక ఈ చిత్రం డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో జరుగుతోంది. పూర్తిగా డ్రగ్స్ చుట్టూ అల్లిన ఈ కథలో హీరో ఆ మాఫియాని ఎలా ఎదుర్కొని యువతని రక్షించాడన్నది చూపించనున్నారు. ఈ చిత్రం గురించి దర్సకుడు మాట్లాడుతూ -''యువత మీదే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అలాంటి యువత డ్రగ్స్ బారిన ఎందుకు పడుతున్నారు? అసలు మన దేశంలోకి డ్రగ్స్ ఎలా వస్తున్నాయి? ఈ డ్రగ్స్ మాఫియాని సర్కార్ గూండా ఎలా ఎదుర్కొన్నాడు? అనే కథతో ఈ చిత్రం రూపొందించాం. శ్రీహరి నటన ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది'' అని చెప్పారు.
నిర్మాత దేవా సుజాత మాట్లాడుతూ... ''మంచితనానికి నిలువెత్తు నిదర్శనం సర్కార్ గూండా. సమాజంలో జరిగే అన్యాయాలను సహించడు. ముఖ్యంగా యువత పెడదోవన పడితే అస్సలు భరించలేడు. అన్యాయాలను ఎదిరించడానికి ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి వెనుకాడడు. ఈ సర్కార్ గూండా పాత్రను శ్రీహరి అద్భుతంగా పోషించారు'' అని దేవా సుజాత అన్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి.
ఇక శ్రీహరి చిత్రాలుకు ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. బి,సి సెంటర్లలో శ్రీహరి చిత్రాలకు డిమాండ్ ఉంది. వారిని టార్గెట్ చేసే విధంగా ీ చిత్రం రూపొందుతోందని చెప్తున్నారు. గతంలో శ్రీహరి హీరోగా వచ్చిన దేవా,సాంబయ్య,గణపతి వంటి చిత్రాలను తలపించేలా ఈ చిత్రం ఉండబోతోందని చెప్తున్నారు. ఈ చిత్రంలో పంకూరి, కోట, రంగనాథ్, బ్రహ్మానందం, జీవా, కార్తీక్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ.


Click it and Unblock the Notifications












