‘నేనెందుకు పనికొస్తాను’..శ్రీహరి డౌట్
"ఈ టైటిల్ వినగానే... 'నేనెందుకు పనికొస్తాను" అని అడిగాను. కథ చెప్పగానే షాక్ అయ్యాను. ఇందులో నేను కామన్ మాన్‌గా కనిపిస్తాను. సగటు పౌరుడికి నా పాత్ర దర్పణంలా ఉంటుంది"" అన్నారు శ్రీహరి. ఇరానీ చాయ్ నేపధ్యంలో శ్రీహరి ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'టీ... సమోసా... బిస్కెట్" చిత్రం ఆదివారం హైదరాబాద్ లో మొదలైంది.ముహూర్తపు దృశ్యానికి సీపీఐ నాయకుడు కె.నారాయణ స్విచాన్ చేయగా, హీరో శ్రీకాంత్ క్లాప్ ఇచ్చారు. డా. డి.రామానాయుడు గౌరవ దర్శకత్వం వహించారు.
బాబ్జీ స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా హంసా నందిని చేస్తోంది. ఇందులో ఇరానీ అమ్మాయిగా కనిపిస్తానని, అభినయానికి ఆస్కారం ఉన్న పాత్ర చేస్తున్నానని హంసానందిని చెప్పారు.దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ..."మాస్ ఇమేజ్ ఉన్న శ్రీహరిగారికి ఈ టైటిల్ ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు. వారికి ఈ సినిమానే సమాధానం అన్నారు.ఇంకా ఏవీయస్, బాబూమోహన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. నరేష్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, నల్లూరి వెంకటేశ్వరరావు, అలీ, సయాజీ షిండే, తనికెళ్ల భరణి తదితరులు ఇతర పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి, సంగీతం: చక్రి, నిర్మాణం: పీపుల్స్ థియేటర్.


Click it and Unblock the Notifications











