మరుగునపడిన గతం గుర్తు చేసారంటూ శ్రీహరి
"మరుగునపడిన గతాన్ని గుర్తు చేయడానికి మురుగదాస్ తీసిన అద్భుతమైన సినిమా 'సెవెన్త్ సెన్స్'. సినిమా ఆద్యంతం థ్రిల్ ఫీలయ్యా. తాను మాత్రమే చెయ్యగలడనే రీతిలో పాత్రపోషణ చేశాడు సూర్య. శ్రుతిహాసన్ తన పరిధిలో బ్రహ్మాండంగా నటించింది'' అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు శ్రీహరి.ఆయన తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో నటించిన 'సెవెన్త్ సెన్స్'సక్సెస్ మీట్ లో పాల్గొని ఇలా స్పందించారు.
ఇక హీరో సూర్య మాట్లాడుతూ..."ఈ సినిమా అనూహ్యమైన వసూళ్లు సాధిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో పాటు విడుదలైన అన్నిచోట్లా గొప్ప కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సినిమా విడుదలయ్యాక అందరూ బోధిధర్మ గురించి మాట్లాడుతున్నారు. నా దృష్టిలో బోధిధర్మ అసలైన సూపర్ హీరో. లవ్, యాక్షన్ సన్నివేశాలు అన్ని సినిమాల్లోనూ ఉంటాయి. కానీ ఇలాంటి కథలు అరుదుగా వస్తుంటాయి. నా కెరీర్‌లో ఐదు అత్యుత్తమ చిత్రాల్లో 'సెవెన్త్ సెన్స్' ఉంటుంది''అన్నారు.
సాయిగణేశ్ ప్రొడక్షన్స్ అధినేత బెల్లంకొండ సురేశ్ మాట్లాడుతూ "ఆంధ్రప్రదేశ్‌లో వారంలో రోజుల్లో 12 కోట్ల షేర్ సాధించడమే ఈ సినిమా ఏ స్థాయిలో విజయం పొందిందనే దానికి నిదర్శనం.తెలుగులో సూర్య సినిమాలన్నింటిలో అతిపెద్ద హిట్టిది. సూర్య హీరోగా కె.వి. ఆనంద్ దర్శకత్వంలో తెలుగు,తమిళ భాషల్లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నా''అని చెప్పారు.
నిర్మాత సుబ్రమణ్యం మాట్లాడుతూ "అనువాద చిత్రాల చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఓపెనింగ్స్ తెచ్చిన సినిమా 'సెవెన్త్ సెన్స్'. 'గజిని'కి ఐదు రెట్లు ఉన్నతంగా ఉన్న సినిమా. ఈ చిత్రంతో మా బేనర్ విలువ రెట్టింపయ్యింది. ఇది ప్రతి భారతీయుడూ చూడాల్సిన చిత్రం'' అని చెప్పారు. 'సెవెన్త్ సెన్స్' సినిమానీ, తన పాత్రనీ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని హీరోయిన్ శ్రుతిహాసన్ చెప్పారు.


Click it and Unblock the Notifications











