రామచరణ్ తో శ్రీహరి?
నువ్వు వస్తానంటే నే వద్దంటానా, మహానంది, ఢీ, ప్రేమాభిషేకం ఇలా వరస సినిమాలలో హీరోయిన్ల అన్నయ్య గా పవర్ ఫుల్ రోల్స్ వేస్తున్న నటుడు శ్రీహరి . ఈ సినిమాలు ఊహించని విధంగా హై రేంజిలో క్లిక్ అయ్యాయి. దాంతో ఇలాంటి పాత్రలు వెతుక్కుంటూ వచ్చి మరీ ఆయనని వరిస్తున్నాయి. అలా హీరో కన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్పీడుగా ఉండి బిజీగా ఉంటున్నాడు శ్రీహరి. అదే కోవలో ఇప్పడు మరో అవకాశం ఆయన తలుపు తట్టింది. రాంచరణ్ హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై యస్.యస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న పేరు పెట్టని చిత్రంలో ఒక కీలక పాత్రకు శ్రీహరిని ఎన్నుకున్నారని తెలుస్తోంది. అయితే మిగతా అన్ని సినిమాలలో లాంటి క్యారెక్టర్ నే ఇందులోనూ చేస్తారా లేక వేరేదా అన్నది ఇంకా తెలియలేదు. అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గుజరాత్, రాజస్థాన్‌లో జరుగుతోంది. దీనిలో రాంచరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇవి ఎలా ఉన్నా రాంచరణ్, శ్రీహరి కాంబినేషన్ కొత్త అంచనాలకు తెర తీస్తోంది.


Click it and Unblock the Notifications